గల్లా జయదేవ్ పెళ్ళి ఫోటోలలో మహేష్ ఎలా ఉన్నాడో చూసారా?

Advertisements

గుంటూరు ఎంపి గళ్ళ జయదేవ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కి బావ అన్న సంగతి తెలిసిందే. గల్లా జయదేవ్ 1991లో మహేష్ బాబు సోదరి పద్మావతి ని పెళ్లి చేసుకున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో గల్లా తన ఆస్తుల విలువ షుమారు 683కోట్లు గా ప్రకటించారు. రాజకీయాలకు దూరం గా ఉండే మహేష్ బాబు గల్లా జయదేవ్ కి మద్దతు గా 2014 ఎన్నికల సందర్భం గా ట్వీట్ చేసారు. స్వతహాగా గల్లా మహేష్ బాగా క్లోజ్ అనే సంగతి తెలిసిందే.జయదేవ్ పెళ్లి ఫోటోలలో మహేష్ ఎలా ఉన్నాడో చూడండి.మరి కొన్ని విశేషాలు….

తన గ్రాడ్యుయేషన్ అయిన తరువాత, USA లో GNB బ్యాటరీ టెక్నాలజీస్ లో అంతర్జాతీయ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా గల్లా జయదేవ్ పనిచేశారు. 1992 లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత, అమర రాజా లో పారిశ్రామిక బ్యాటరీల అమ్మకాలు మరియు సర్వీస్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసారు. 1992 లో తన తండ్రి రామచంద్ర నాయుడు గల్లాతో కలిసి ఆటోమోటివ్ బ్యాటరీలను తయారు చెయ్యటం, వ్యాపారంగా చెయ్యటం మొదలుపెట్టారు. భారతదేశంలో అధునాతన ప్రధాన యాసిడ్ బ్యాటరీల యొక్క ప్రముఖ తయారీదారుల్లో అమర రాజా బాటరీ లిమిటెడ్ ఒకటి. జయదేవ్ తన తండ్రి నుండి 2003 లో అమర రాజా బ్యాటరీస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా తన తల్లి క్రియేట్ చేసిన మార్క్ ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కాక జయదేవ్ భారత పార్లమెంటులో ప్రజలకి సంబందించిన రకరకాల సమస్యలపై మాట్లాడారు. 2018 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి, ఫిబ్రవరి 07, 2018 లో లోక్సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధుల కంటే బాహుబలి మూవీ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.


Advertisements

Leave a Reply