EXCLUSIVE : నిన్నటి భేటిలో టిడిపి కొట్టిన చావుదెబ్బ గురించి “ప్రత్యేకంగా” ప్రస్తావించిన జగన్

జగన్ అధ్యక్షతన వైసీపీ నేతలతో కీలక సమావేశం నిన్న జరిగింది. ప్రత్యేక హోదా గురించి ఈ సమావేశంలో తీవ్రం గా చర్చించారు. పాదయాత్రకు విరామమిచ్చి మరీ కలిగిరి మండలం పెద్దకొండూరులోని వైఎస్ జగన్ బస చేసే శిబిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కేంద్రం ఇచ్చిన నిధులు, విభజన హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆ చర్చలో జగన్, తెలుగు దేశం కార్యకర్తల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

ఈ భేటి అయ్యాక…. జగన్, ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన లేటెస్ట్ సర్వే రిపోర్ట్ గురించి చెప్పినట్టు గా సమాచారం.బడ్జెట్ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగు దేశం పూర్తీ ఎడ్జ్ లోకి వచ్చిందని, వైకాపా స్టాండ్ ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్లలేదని సర్వే లో తేలినట్టు గా చెప్పారు. వైకాపా కంటే తెలుగు దేశం ఎంపి లు ఎక్కువ కష్టపడినట్టు గా, ఎక్కువ పోరాడినట్టుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వైకాపా ఎంపి మిథున్ రెడ్డి బాగా మాట్లాడినా, గల్లా జయదేవ్ అందరిని మించిపోయాడని, బడ్జెట్ మీద పోరాడినట్టుగా ప్రజల్లో హీరో అయ్యాడని చెప్పారు. చాలా మంది మిథున్ రెడ్డి ఎవరో కూడా తెలీదు అన్నారని చెప్పుకొచ్చాడు.బిజెపి నిధులు ఇవ్వకపోయినా, చంద్రబాబు సాధించగలరు అని తాము నమ్ముతున్నట్టు గా ఎక్కువ శాతం మంది అభిప్రాయపడినట్టు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తెలుగు దేశం శ్రేణులు బిజెపి ని దోషి గా నిలబెట్టటంలో బాగా సక్సెస్ అయ్యారని,అంతే కాక వాళ్ళు బిజెపి మీద తీవ్ర స్థాయి లో పోరాటం చేసారని, బిజెపి తప్పు చేసింది అన్నట్టు గా వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఒక ఆర్డర్ లో బిజెపి మీద విమర్శలు చేసారని చెప్పుకొచ్చారు. తెలుగు దేశం కార్యకర్తలు చేసిన విమర్సల స్థాయి కి బిజెపి మురికిలోకి కూరుకు పోయిందని, ఇప్పుడు వాళ్ళు తెంచుకున్నా వైకాపా కలిస్తే మునిగే అవకాసం ఉందని, అలా తెలుగు దేశం కార్యకర్తలు ఒక దెబ్బకి బిజెపి ని డామేజ్ చేసి మనకి నష్టం చేయ్యగాలిగారని పీకే రిపోర్ట్ లో స్పష్టం గా ఉందాని చెప్పుకొచ్చారు.. కాబట్టి మీరు బిజెపి కి వ్యతిరేకం గా పోరాడితేనే బెటర్ అని పీకే రిపోర్ట్ లో ఉన్నట్టు గా జగన్ చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా నిర్వేదం లో కూరుకుపోయిన వైకాపా శ్రేణులకు దిశా నిర్దేశం చెయ్యాలని సూచించాడట పీకే. తెలుగు దేశం కార్యకర్తలు ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్తున్నారని, మనలో అది లోపించింది అని చెప్పుకోచ్చాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here