ప్రతి ఆంధ్రా బిజెపి కార్యకర్తకు పట్టిన అదృష్టం…..దశ మారుతుంది

Advertisements

మీరు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కార్యకర్త….అయితే మీకు అదృష్టం పట్టినట్టే…. తలుపు తట్టినట్టే…. మీ రాజకీయ భవిష్యత్ లో కీలక మలుపు అతి త్వరలో జరగబోతుంది….పూర్తీ వివరాలు మరికొన్ని రోజుల్లో తెలుస్తాయ్. మీ దశ దిశ మార్చే అవకాశం రాష్ట్ర బిజెపి మీకు కలిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మీ నియోజకవర్గం లో మీరు బాగా యాక్టివ్ గా ఉండే కార్యకర్త అయితే చెప్పలేము…ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు…. మీ రాతా మారవచ్చు….  వివరాల్లోకి వెళ్తే…

సోషల్ మీడియా లో ఆంధ్రా కి జరిగిన అన్యాయం  మీద, నమ్మించి మోసం చేసిన బిజెపి మీద తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిజేఫై మీద ఆగ్రహం గా ఉన్న కొందరు బిజెపి మీద తిట్ల దాడి చేస్తూ ఉండగా, మరికొందరు బిజెపి మీద సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరి బాబు మాట్లాడుతూ, టిడిపి మీద విమర్సల  వర్షం కురిపించారు. అంతే కాకుండా బిజెపి 175 స్థానాల్లో పోటి కి సిద్దం గా ఉందని ప్రకటించారు. అయితే దీని మీద సెటైర్లు పేలుతున్నాయి,అసలు మీకు రాష్ట్రం మొత్తం వెతికినా  175 మంది అభ్యర్ధులు ఉన్నారా? ఒక వేళ ఉంది ఉంటె ఎప్పుడు ఇద్దరు ముగ్గురే దేనికి కనపడతారు? ఎన్నికల్లో పోటి కి అభ్యర్ధులు కష్టం కాని, ఒక  175 మంది కార్యకర్తలని వెతికి వారికి ఇవ్వండి ఎమ్మెల్యే సీట్లు. లేని బలాన్ని ఊహించుకుని రాష్ట్రానికి నష్టం చేస్తే ఊరుకోము.మీకు ఉత్తర భారత దేశం లోనే చాలా చోట్ల పొత్తు లేకుండా పోటి చేసే సీన్ లేదు, మరి అసలు ఏమి లేని ఆంధ్రా లో 175 సీట్లలో పోటి చేసే పని అయితే తెలుగు దేశం తో పొట్టు దేనికి అని సెటైర్లు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మీరు 175లో పోటి చేసి కనీసం 5% స్థానాల్లో గెలిచే పని లేదు, డిపాజిట్స్ తెచ్చుకోండి.అదే మీకు భారి విజయం కింద లెక్క అని పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. బిజెపి ఆంద్ర ప్రదేశ్ కి న్యాయం గా ఇవ్వవలసినవి ఇచ్చే దాకా ఈ గొడవ ఆగేలా లేదు.

Advertisements

Leave a Reply