ఆ ఎమ్మెల్యే ని టిడిపి లోకి రానివ్వరు….. లక్ష రూపాయిల పందెం..ఇదీ గుంటూరు జిల్లా లెక్క

Advertisements

గుంటూరు జిల్లా అంటేనే రాజకీయం గా చైతన్యం ఉండే జిల్లా. అక్కడ తెలుగు దేశం లో వర్గాలు ఎక్కువ. అలాంటిది అక్కడ వర్గాలన్నీ కలిసి ఒకే కారణం కోసం ఏకమ అయితే చంద్రబాబు కాదని దేనికి అంటారు? ఎప్పుడూ ఉప్పు నిప్పు గా ఉండేవారు ఏకాభిప్రాయానికి వస్తే చంద్రబాబు మాత్రం ఎలా కాదంటారు. సరిగా అదే జరిగింది, ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు పార్టి లోకి రావటానికి ఎప్పటి నుంచొ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫా అయితే రెండో ఎమ్మెల్యే బాపట్లకు చెందిన కోన రఘుపతి….ఇప్పుడు అందరు కలిసి వ్యతిరేకిస్తుంది ఎవర్ని? ఎందుకు? వివరాలు ఇవిగో….

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫా ని తెలుగు దేశం లోకి తీసుకుని రావటానికి రాయపాటి ఎప్పటి నుంచొ ప్రయత్నించి మొత్తానికి గత వారం లో చంద్రబాబు కి ముస్తఫా ని పరిచయం చేసారు. అయితే ముస్తాఫా ఎప్పుడు జాయిన్ అవుతాడు అనే విషయం మీద స్పష్టత లేకపోయినా..సైకిల్ ఎక్కటం మాత్రం ఖాయం గా ఉంది.అయితే తెలుగు దేశం నేతలు అంతా కలిసి వ్యతిరేకిస్తుంది మాత్రం బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ని. దీనికి బలం అయిన కారణాలు ఉన్నాయి. కోన రఘుపతి ని ఇప్పుడు పార్టి లోకి తీసుకోవటం లో కొత్త గా జరిగే లాభం లేకపోయినా జరిగే నష్టం ఎక్కువ అని గుంటూరు జిల్లాకి చెందిన శాసనసభ్యులు అభిప్రాయ పడినట్టు గా తెలుస్తుంది. ఆయన కి లోకల్ తెలుగు దేశం నాయకులతో కాని కార్యకర్తలతో కాని సఖ్యత లేదని,ఆయన మనకి అనవసరం అని నిష్కర్ష గా చెప్పినట్టు గా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే, మంత్రి గాదె వెంకట్ రెడ్డి కూడా కోన ని చేర్చుకోవటం ఉపయోగం లేదని తెలుస్తుంది. గత ఎన్నికల్లో కేవలం 5000 ఓట్ల తో గట్టెక్కిన కోన ఈ సారి గెలవటం అంట ఈజీ కాదని చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యం గా 2014 కంటే పార్టి పరిస్థితి చాలా మెరుగు అయ్యిందని, అభివృద్ధి జరుగుతుందని, ప్రజల్లో ఆదరణ కనిపిస్తుందని, దళిత వాడల్లో సిసి రోడ్లతో పాటు, డ్రైనేజ్ సమస్యలు కూడా తీరాయి అని, ఇలాంటి టైమ్ లో అతన్ని రానివ్వాల్సిన అవసరం లేదు అని చెప్పెసారట. ఎప్పుడు ఉప్పు నిప్పు లా ఉండే జిల్లా నేతలు ఒకే మాట మీద నిలబడటం తో చంద్రబాబు హోల్డ్ లో పెట్టారట. అయితే కోన ని పార్టి లోకి రానివ్వరు అని ఐదు వేల నుంచి లక్ష రూపాయిల వరకు బాపట్ల తెలుగు తమ్ముళ్ళు పందెం వేసుకుంటున్నారు.ఎప్పుడు జాయిన్ అయినా ముస్తాఫా ఒక్కడే కాని, కోన కి డోర్ క్లోజ్ అని నమ్మకం తో పందేలు నడుస్తున్నాయట.

Advertisements

Leave a Reply