తప్పిపోయిన చిరంజీవి దొరికారు, ఎక్కడున్నారో తెలిస్తే దణ్ణం పెడతారు

Advertisements

ఒక పక్క విభజన హక్కుల కోసం టిడిపి ఎంపిలు పోరాడుతుంటే అత్యంత కీలక కాంగ్రెస్ నేత మెగా స్టార్, అభిమానుల అన్నయ్య చిరంజీవి గారు కనపడలేదు, మామూలు గానే సార్ గారి రాజ్యసభ హాజరు శాతం 32%. తెలుగు రాష్ట్రాల్లో  నుంచి ఉన్న ఎంపి లలో అత్యంత అధమమైన హాజరు శాతం. ఇప్పుడు ఒక సారి ఒక్క చిన్న ఫ్లాష్ బాక్ వేసుకుంటే….ఆయన కాంగ్రెస్ ఎంపి గా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది.అప్పుడు ఆపలేకపోయారు సారూ గారు. దానికి మీడియా ముందు దాదాపు నాలుగు లీటర్ల విచారం, రెండు లీటర్ల బాధ, మూడు కేజీల నిరుత్సాహం వ్యక్తం చేసారు. ఆయన ఫాన్స్ విజిల్ వేసారు, అది వేరే విషయం…ఇదిగో సార గారి హాజరు,ఆయన పోరాడిన ప్రజా సమస్యల డీటెయిల్స్…

నిజం గా ఆ రోజు న అంత బాధ పది ఉంటె ఇప్పుడు పార్లమెంట్ కి వెళ్లి పోట్లాడాలి గా, లోక్ సభ లో ఎవరు లేరు గా, ఉన్న కొద్ది మంది రాజ్యసభాలోనేగా. ఆ రోజున అంత బాధ పడిన ఈయన ఈ రోజు పోరాడచ్చు గా…పార్టి దేనికి కాంగ్రెస్ లో కలిపారు, రాష్ట్ర విభజన దేనికి ఆపలేకపోయారు అని అడగట్లేదు, ఈ రోజున అయినా వెళ్లి అడగొచ్చు గా అనే అడుగుతున్నాం. ఈయన చాలా రోజుల నుంచి కనపడట్లేదు, తప్పి పోయారు అని అందరి భావన. సోషల్ మీడియా లో ట్రాల్స్ కుడా వచ్చాయ్. సరే ఈయన రాజ్యసభ కి పోలేకపోయినా కనీసం స్పందిచవచ్చు గా. ఆయన మాట బయటకి చెప్పొచ్చు గా, కనీసం ఫామిలి లో ఒక క్రికెట్ టీం కి సరిపడా హీరోలని వదిలారు? కనీసం వాళ్ళన్నా మాట్లాడొచ్చుగా. ఎవరూ స్పందించలేదు. సరే కనీసం ఆయన ఏమి చేస్తున్నారో,ఎక్కడ ఉన్నారో తెలిసిందా. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకండి, చిరాకు పుడుతుంది. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారా అని చుస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రోల్ కోసం ‘మేకోవర్’ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే రెండుసార్లు ఫేషియల్ గెటప్స్ మార్చిన చిరంజీవి,ఈసారి బాడీని ట్రిమ్ చేయించడం కోసం నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు,సైరా యూనిట్ లీకులిచ్చింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా మన గ్లామర్ తగ్గకూడదు.సినిమా చేసుకుని అమ్ముకుంటే డబ్బులు వస్తాయ్. నలభై ఏళ్లుగా ఆదరించిన రాష్ట్రం ని అలా వదిలేసి ఎలా ఉంటున్నారో, హాట్స్ ఆఫ్ సామి. మీకు ఒక దణ్ణం.

Advertisements

Leave a Reply