BREAKING : చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకుంటారా? లోకేష్ కి ఆల్టర్నేటివ్ ని తెస్తారా?

Advertisements

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కాని శాశ్వత మిత్రులు కాని ఉండరు అంటారు. కాని శాశ్వత శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులు అయ్యే అవకాశం చాలా తక్కువ. అంటే రాహుల్ గాంధి బిజెపి లో చేరటం, మోడీ కాంగ్రెస్ లో చేరటం లాంటివి. అది పక్కన పెడితే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు మామూలే. కాని వేసే ఎత్తులు చాలా జాగ్రత్త గా వెయ్యాలి,ఆలోచించాలి. ఎత్తు తప్పిందా, బొక్క బోర్లా పడటం ఖాయం. ఇప్పుడు అలా ఎత్తు తప్పి బొక్క బోర్లా పడిన వార్త ఒకటి నేట్టింట్లో హల్చల్ చేస్తుంది.వివరాల్లోకి వెళ్తే…

దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురందేశ్వరి దంపతుల గురించి కొత్త గా పరిచయం అక్కర్లేదు. వారి కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ ని పర్చూరు తెలుగు దేశం అభ్యర్ధి గా 2019లో పోటి చేయించాలి అని దగ్గుబాటి దంపతులు భావిస్తున్నట్టు, దానికి నందమూరి బాలకృష్ణ సైతం సుముఖం గా ఉన్నాడని ఆ వార్త సారాంశం. ఒక వేళ చెంచురామ్ కి అవకాశం ఇస్తే ఇకపై చంద్రబాబు మీద విమర్శలు చెయ్యబోము అని దగ్గుబాటి దంపతులను ఊటంకిస్తూ రాసిన ఆ వార్త తెలుగు దేశం శ్రేణులను చిన్న కుదుపుకు గురి చేసింది. దానికి కారణం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రకాశం జిల్లాలో గెలిచే మొదటి సీట్ పర్చూరు అని ప్రకాశం రాజకీయాలు పరిశీలించే వారికి చెప్పే పని లేదు.ఇప్పుడు ఊడిపడిన ఈ చెంచురామ్ వార్త లో నిజానిజాలు, సాధ్యాసాధ్యాలు చూద్దాం. ఈ వార్త బయటకి రావటం వెనుక ఎటువంటి బ్రెయిన్స్ ఉన్నాయో, ఎవరు చేయిస్తున్నారో అప్రస్తుతం. తనని అకారణం గా ద్వేషించి, రెండు దశాబ్దాలు గా అనరాని మాటలు అని, పుస్తకాలు వేసి, వ్యక్తిగతం గా డామేజ్ చేసిన వాళ్ళు సడెన్ గా వచ్చి అయ్యా నువ్వే ఎదో ఒకటి చెయ్యాలి అంటే? చేస్తారా? చంద్రబాబు ని ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని పుస్తకాలు వేయించారు మర్చిపోగలరా? గత నాలుగేళ్ళుగా పురందేశ్వరి గారు,మిత్ర పక్షం బిజెపి లో ఉంటూ రాష్ట్రం మీద,చంద్రబాబు మీద చేస్తున్న విమర్శల

సంగతి తెలిసిందే. చంద్రబాబు తన వారసుడు గా లోకేష్ ని తీసుకుని వచ్చారు, కొన్ని బాద్యతలు అప్పచెప్పారు, ఐటి మినిస్టర్ గా సంవత్సరం లోపే తన ముద్ర క్రియేట్ చేసాడు లోకేష్, మరొక పక్క పార్టి మీద పట్టు సాధిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నారా కుటుంబాన్ని అకారణం గా ద్వేషించే దగ్గుబాటి కుటుంబాన్ని పార్టి లోకి తీసుకుని వచ్చి లోకేష్ కి థ్రెట్ క్రియేట్ చేసే అవసరం ఉందా? లోకేష్ బాద్యతలు చేపట్టే నాటికి వీలు అయినంత స్మూత్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.ఈ పరిస్థితుల్లో కుటుంబం లో నుంచి ఇంకొకరిని తెచ్చి సెల్ఫ్ గోల్ వేసుకుంటారా? అంటే అసాధ్యం అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది కాక నాలుగేళ్ళలో పర్చూరుని తెలుగుదేశం కంచుకోట గా మార్చిన ఏలూరి ని కాదని ఇంకొకరిని ఎలా ఎంకరేజ్ చేస్తారు అనేది సమాధానం లేని ప్రశ్న. చంద్రబాబు చాణక్యనీతి తెలిసిన ఎవరన్నా ఈ వార్త ని కొట్టి పారేస్తారు. ఒక వేళ అక్కడ తెలుగు దేశానికి అభ్యర్ధి లేకపోయినా, ఉన్న అభ్యర్ధి సరిగ్గా పని చెయ్యకపోయినా యిలాంటి వార్తలు వచ్చే స్కోప్ ఉంటుంది. కాని చంద్రబాబు సర్వే లో Aగ్రేడ్ వచ్చిన ఏలూరు సాంబశివరావు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో యాక్టివ్ గా లేని నాయకులని కూడా కలుపుకుని వెళ్తున్నారు.ఆయన చంద్రబాబు కి నమ్మకస్తులు అన్న సంగతి తెలిసిందే, ఆయన్ని తీసి

మరీ దగ్గుబాటి కుటుంబాన్ని తెస్తారా? ఒక రకం గా చుస్తే దగ్గుబాటి కుటుంబం రాజకీయాల నుంచి విరమించుకునే టైమ్ ఆసన్నమయ్యింది అంటున్నారు జిల్లా నేతలు.

Advertisements

Leave a Reply