చైతు-సమంతా అభిమానులకు త్వరలోనే క్రేజీ న్యూస్

నాగ చైతన్య సమాంత, టాలివుడ్ లో నే చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్న యువ జంట. వీళ్ళిద్దరూ కలిసి పని చేసిన ఫస్ట్ మూవీ లోనే ఈ జంట అందరిని ఆకట్టుకుంది.  ఇద్దరు కలిసి మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఏమాయ చేసావే, మనం, ఆటో నగర సూర్య. వెండి తెర మీద ఈ జంట బావుంటుంది అనుకుంటూ ఉన్న తరుణం లో గత సంవత్సరం ఇద్దరు వివాహం చేసుకుని ఒక ఇంటి వారయ్యారు. ఇక పోతే ఈ జంట నుంచి వారి అభిమానులకు త్వరలోనే క్రేజీ న్యూస్ రాబోతుంది.

చైతు ప్రస్తుతం సవ్యసాచి చిత్రీకరణ లో బిజీ ఉండగా సమాంత తెలుగు లో రంగస్థలం లోను, మహానటి లోను, తమిళ్ లో వేరే రెండు ప్రాజేక్స్ట్ లోనూ బిజీ గా ఉంది. చైతు సవ్యసాచి చిత్రీకరణ కోసం అమెరికా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో ఈ షూటింగ్ జరగవచ్చు. సమాంత నటించిన రంగస్థలం ఏప్రిల్ లో విడుదలకు సిద్దం అవుతుంది. ఇదిలా ఉండగా చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అయ్యాక వీళ్ళిద్దరూ కలిసి ఒక చిత్రం లో నటించే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ తీసిన శివ నిర్వాణ దర్శకత్వం లో వచ్చే చిత్రం లో ఈ జంట కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చైతు కి లైన్ నారేట్ చేసాడు శివ.నాగ చైతన్య వెంటనే చెయ్యటానికి ఒప్పుకున్నారు.అయితే శివ ప్రస్తుతం సమంతా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సమంతా కి కూడా కథ నచ్చితే ఈ చిత్రం ఈ సంవత్సరమే పట్టాలేక్కే అవకాశం ఉంది. నిన్ను కోరి నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రం నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం గురించి పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక వేళ ఈ జంట మరొక సారి వెండి తెర మీద తళుక్కుమంటే ఇరువురి అభిమానులకు పండగే కదా. ఈ చిత్రం ప్రేమ కథా? మరేమన్నానా లాంటివివరాలు తెలియాలి అన్నా మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే. త్వరలోనే ఈ జంట వెండి తెర మీద కనిపించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here