మీరు సినీ ప్రేమికులా, మీకు మార్చ్ నుంచి నరకమే : దేనికో తెలుసా?

Advertisements

మీకు గుర్తుందా, కొన్ని నెలల క్రితం అగ్ర నిర్మాత సురేష్ బాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిర్మాతలు ఎదురుకుంటున్న కష్టాలు ఏకరువు పెట్టారు. ఆయన చెప్పటం కాదు కాని మనకి తెలీదా? ఒక నిర్మాత కి ఎన్ని కష్టాలు ఉంటాయో, అసలు ఇప్పుడు తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న నిర్మాతలని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కష్ట నష్టాలకి ఓర్చి సినిమా తీస్తుంటే చెప్పి మరి మొదటి రిలీజ్ చేసే పైరసీ సైట్స్ ఉన్నాయ్ గా. రిలీజ్ అయ్యాక సినిమా ఆడుతుందో లేదో తెలీదు. నిర్మాతని అన్ని వైపులా నుంచి పిండుతున్నారు.ఇవన్ని చాలవు అన్నట్టు  యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్ బీ లాంటి డిజిటల్ కంపెనీల పిడికిట్లోనే ఇప్పుడు సినిమా ప్రదర్శించే దియేటర్ వ్యవస్థ మొత్తం చిక్కుకుంది. వీళ్ళ సహకారం లేకుండా.. ఏ థియేటర్లో కూడా సినిమా ప్రదర్శించే అవకాశం లేదు, ఇప్పుడు ఇదొక నియంతృత్వ వ్యవస్థలా మారింది.సినిమా దియేటర్ల  మీద ఆధారపడిన ఈ వ్యవస్థ మొత్తం దియేటర్ వ్యవస్థని శాసించే స్థాయికి చేరింది.

థియేటర్ యాజమాన్యాల నుంచి సినిమా ప్రొడ్యూసర్ల దాకా.. అందరూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు చెప్పింది చెయ్యటమే. ఇది ఏ స్థాయి లో ఉంది అంటే వాళ్ళు చెప్పిందే రేటు, ఆక్యుపెన్సీ తో సంబంధం లేదు. షో వేసినా లేకున్నా వాళ్ళ చార్జెస్ వాళ్ళవే. ఒక రకంగా  రక్తం పిండుతున్నారు. ఈ దోపిడీ నుంచి మమ్మల్ని కాపాడండి అని ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. లాభం లేదని ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కలుగజేసుకుని సినిమాల విడుదలను నిలిపివేయాలంటూ ప్రతిపాదన పెట్టింది. కానీ థియేటర్లు-డిజిటల్ ప్రొవైడర్ల మధ్య గొడవల వల్ల మా సినిమాల్ని  ఆపి మేము నష్టపోతాం అని నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీనికి ఒక సొల్యుషన్ తీసుకుని రావాలని డిసైడ్ అయిన ఫిలిం చాంబర్లు,  ఫిబ్రవరి 1న (అంటే నిన్న) దక్షిణాది రాష్ట్రాల ఫిలిం ఛాంబర్లన్నీ సమావేశమయ్యాయి. డిజిటల్ ప్రొవైడర్ల విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన ఈ భేటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు సిండికేట్ గా తయారయ్యి మిగతా కంపెనీలను మార్కెట్లోకి రానివ్వకుండా దోపిడీ సాగిస్తున్నాయని సభ్యులంతా ఆరోపించారు. వారం రోజులోగా దారికొచ్చి ధరల తగ్గింపుపై ప్రకటన చెయ్యాలని లేకపోతె మార్చి 1 నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ మూసివేయక తప్పదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఏకగ్రీవంగా తీర్మానించింది. కాని దీనికి ఆల్రడి విడుదలకి సిద్దం అయిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాని ఫిలిం చాంబర్ మాత్రం గట్టి పట్టుదలతో ఉంది. ఒక వేల అదే జరిగితే సినిమా ప్రేమికులకి నరకమే, పాపం.

 

 

 

 

Advertisements

Leave a Reply