చిరంజీవికి కళ్యాణ్ వల్ల తీరని గండం ఉందా?

Advertisements

చిరంజీవి వెండితెర మీద మకుటం లేని మహారాజు. నిస్సందేహంగా వెండి తెర మీద ఒక మంచి ఎంటర్టైనర్. దాదాపు మూడు దశాబ్దాల పాటు తిరుగులేని మారాజు గా తెలుగు సినీ జగత్తుని రూల్ చేసిన మెగా స్టార్ కొద్ది కాలం సినిమాలకి దూరం గా ఉండి మరలా ఈ సంవత్సరమే ఖైది నంబర్ 150 తో బాక్స్ ఆఫీస్ తో బాస్ ఈజ్ బాక్ అనిపించాడు. బాహుబలి తర్వాత హైయ్యెస్ట్ గ్రాసర్ గా ఆ సినిమా నిలిచింది అంటే అది కేవలం చిరంజీవి కరిష్మానే అనుకోవాలి. అలాంటి చిరంజీవి కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరు దాదాపు ఒక పది మంది నటులు పరిచయం అయ్యారు. చిరంజీవి తమ్ముడు గా తొలుత నాగ బాబు, ఆనక పవన్ కళ్యాణ్, కొద్ది కాలానికి అల్లు అర్జున్,రామ్ చరణ్,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్,అల్లు శిరీష్, నిహారికా ఇలా వస్తూనే ఉన్నారు.

మాములుగా పబ్లిక్ మీటింగ్స్ లో తనని తానూ సంభాళించుకుని మాట్లాడే చిరంజీవి ఈ మధ్య కొన్ని సార్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఒక్క ఆయనే కాకుండా అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ బాబు కూడా అలా అసహనం వ్యక్తం చేసిన వారే. వీళ్ళ అసహన్ననికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే పవర్ స్టార్ నామ జపమే. ప్రతి సారి సమయం సందర్భం లేకుండా పవన్ ఫాన్స్ చేసే నినాదాలు ఇబ్బంది గా ఉన్నాయని మెగా హీరోలు అభిప్రాయ పడ్డారు. కానీ మెగా ఫామిలి అంతా ఒక ఎత్తు కళ్యాణ్ ఒక ఎత్తు అంటారు పవర్ అభిమానులు. అల్లు అర్జున్ కూడా గతం లో పవర్ స్టార్ నామజపం చేసి రెండు హిట్స్ రాగానే పవన్ కళ్యాణ్ ని మర్చిపోయాడని పవన్ ఫాన్స్ ప్రధాన ఆరోపణ. ఇలా ఒక కళ్యాణ్ స్టార్డం తో ఇబ్బంది పడుతున్న మెగా స్టార్ కి ఇప్పుడు ఇంకొక కళ్యాణ్ తో తలనొప్పి వచ్చి పడింది. అదే చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ కనుగంటి వల్ల.

కళ్యాణ్ కనుగంటి ని తన చిన్న కుమార్తె శ్రీజకు ఇచ్చి గత సంవత్సరం వివాహం చేసారు. తర్వాత కాలం లో కళ్యాణ్ సినిమా హీరో కావాలి అన్న తన కోరికను మామయ్య చిరంజీవి దగ్గర చెప్పటం ఆయన వెంటనే ఒకే అనటం వెంటవెంటనే జరిగిపోయాయి.కళ్యాణ్ డెబ్యూ మూవీకి ‘జత కలిసే’దర్శకుడు రాకేష్ శశి కథను అందించి ఆయనే దర్శకత్వం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కళ్యాణ్ హీరోగా స్థిరపడేందుకు మేకోవర్ మొదలు పెట్టేశాడట. నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్న మెగా అల్లుడు మామ పేరును నిలబెట్టేందుకు బాగానే కష్టపడుతున్నాడు అని తెల్సింది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ మెగా ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నారు. కాగా కళ్యాణ్ ని హీరో గా చెయ్యాలి అనుకోవటమే మెగా ఫామిలి లో చిచ్చుకి కారణం అయ్యింది. కళ్యాణ్ హీరో కావటం తమకు నచ్చలేదని మెగా హీరోలు బాహాటం గానే అంటున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.

చిరంజీవి కి తన చిన్న కుమార్తె శ్రీజ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆయన కళ్యాణ్ కి మద్దతు ఇస్తే తమకి  మెగా అభిమానుల మద్దతు పోతుందని, ఇప్పుడిప్పుడే తమ కెరీర్లు ఒక దారికి చేరుకుంటున్న తరుణంలో చిరంజీవి ఇలా చెయ్యటం బాలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్.చిరంజీవి తన మద్దతు తన కొడుకు చరణ్ కి అల్లుడు కళ్యాణ్ కి ఇస్తే తమ పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏ నిర్ణయం అయినా చిరంజీవి వ్యక్తిగతమే కాని, మా గురించి కుడా ఆలోచించాల్సింది అని అంటున్నారని తెలుస్తుంది. కళ్యాణ్ మీద వస్తున్న అసంతృప్తికి చిరంజీవి కూడా అసహనంకి గురయ్యారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం 10 మందిని చూసాము, ఇంకోక్కరేగా చూస్తాము అని అంటున్నారు. అందుకే అంటున్నాం కళ్యాణ్ అనే పేరుతోనే చిరంజీవి గండం ఉన్నట్టు ఉందని.

Advertisements

Leave a Reply