MUST READ : చంద్రబాబు ప్రధాని అభ్యర్ధి అయితేనే తృతీయ ఫ్రంట్, సూపర్ రీజనింగ్ ఇచ్చిన పొలిటికల్ అనలిస్ట్

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ట్రేండింగ్ టాపిక్ తృతీయ ఫ్రంట్. ఒక పది రోజుల క్రితం కెసిఆర్ తృతీయ ఫ్రంట్ అనే మాట అన్న నాటి నుంచి దాని మీద రకరకాల స్పందనలు, విభిన్న రకాల కామెంట్స్ వస్తున్నాయి. తమ ఆధిపత్యానికి గండి అనుకున్నారో ఏమో కాని కాంగ్రెస్, బిజెపి అయితే అవసారం అయిన దాని కంటే ఎక్కువ స్పందించాయి. తృతీయ ఫ్రంట్ విజయానికి అదే తొలి మెట్టు అని అందరు భావించారు. అయితే కేంద్రం లో తృతీయ ఫ్రంట్ అంటూ వస్తే అక్కడ ఖచ్చితం గా ఉండాల్సిన నేత చంద్రబాబు.చంద్రబాబు ఉన్నారు అంటే మేము రెడి అనే పార్టీలు ఐదు నుంచి ఆరు దాకా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రెడి గా

ఏమి ఉన్నాయ్ అంటే కూడా శివసేన,డిఎంకే,టిఎంసి,కమల్ పార్టి, అకాలిదళ్, జేడియు అని చెప్పుకోవచ్చు. ఇవి కాక నవీన్ పట్నాయక్,ములాయం, నితీష్ కుమార్ లాంటి వారు చంద్రబాబు కి పాత కాపులే…గతం లో కలిసి పని చేసిన వారే.అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు మీద తృతీయ ఫ్రంట్ కి ముందుకు రమ్మని కోరేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపధ్యంలో నేషనల్ పత్రికలో ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తొంభైలలోనే జాతీయ రాజకీయాలో కింగ్ మేకర్ గా, థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా వ్యవహరించిన చంద్రబాబు మీద చాల నమ్మకం ఉంది.అందరిని కలుపుకుని వెళ్ళే నాయకుడు గా చంద్రబాబు మన్ననలు పొందారు.ఎన్టీయార్ నేషనల్ ఫ్రంట్ ను తీర్చిదిద్దిన సమయంలోనూ తెరవెనక చంద్రబాబు చాలాకీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీ చేసిన నమ్మక ద్రోహంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెసుతో కలవడంలో సెంటిమెంట్లు అడ్డు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబును నేషనల్ రోల్ లోకి రమ్మని అనేకమంది నాయకులు ఆహ్వానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. విస్తృతమైన సంబంధాలు కలిగి ఉండటం, వ్యూహరచన అతని ప్రధాన బలం. మోడీకి దీటైన నాయకునిగా అప్పుడే ప్రచారం కూడా ప్రారంభమైంది, ఇదే మోడీ ఇన్సేక్యూరీటికి కారణం గా చెప్తున్నారు. అంతే కాకుండా కార్పొరేట్స దిగ్గజాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమూ అదనపు బలమే. దేశంలో తొలి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న చంద్రబాబుకు జాతీయ మీడియా అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.

ప్రత్యేక ఫ్రంట్ నెలకొల్ప గలిగితే చంద్రబాబు మూడో ఫ్రంట్ ను సమర్థంగా నడపగలరనే నమ్మకాన్ని టీడీపీ వర్గాలే కాకుండా ఇతర ప్రాంతీయ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మనుగడ సాగించటం చాలా సులువు గా ఉంటుంది. 90లలోనే ఆయన రెండు సార్లు ప్రధాని పదవి వద్దు అన్నారు. కాని 15 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన దేశాన్ని ముందుకు తీఉస్కుని వెళ్ళాలి అంటే అది కేవలం చంద్రబాబు లాంటి దీర్ఘదర్శి వల్లనే అవుతుంది. కరుణానిధిని మినహాయిస్తే దక్షిణాదిన ఉన్న నాయకులందరి కంటే సీనియర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేశారు. దక్షిణాదిన కొత్త పార్టీతో బరిలోకి దిగుతున్న రజనీకాంత్ వంటి వారితో సన్నిహిత సంబంధాలున్నాయి. కమల్ హాసన్ సైతం చంద్రబాబు నా హీరో అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఆంధ్రా సీఎంకు కలిసొచ్చే అంశాలే. ఆయన లాంటి నేత ఇప్పుడు దేశానికి అవసరం. ఆయనకీ ఉత్తర భారతం లోను చాలా మంది అభిమానులు ఉన్నారు. అహం లేకుండా చాలా గుంభనం గా ఉండటం ఆయన అదనపు బలం. ప్రతి పనికి ఒకటికి రెండు సార్లు తీక్షణం గా ఆలోచించే ఆయన ఇప్పుడు దేశానికి చాలా అవసరం. ఉత్తర భారత్ దక్షిణ భారత్ అనే వేర్పాటు వాదం పాలకుల నిర్లక్ష్యం వల్లనే పుడుతుంది. కెసిఆర్ లేవనెత్తిన చాలా పాయింట్స్ బావున్నాయి. దేశం ఒక కొత్త నాయకుడి పాలన కోసం ఎదురు చూస్తుంది. ఆ వ్యక్తీ భారతీయుడు అయితే చాలు, దక్షిణ భారతం వాడా? ఉత్తర భారతం వాడా అనేది చూసే పని లేదు. కెసిఆర్ గురించి నేను చాలా విన్నాను, కాని నా మద్దతు చంద్రబాబు కే, ఆయనని దగ్గర నుంచి చూసిన వాడిగా చెప్తున్నా, ఆయన ఒప్పుకుంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుంది. నా మద్దతు ఆయనకే అంటూ ముక్తాయింపు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here