చంద్రబాబు నుంచి కేంద్రానికి రెండు రోజులలో రెండు చావు దెబ్బలు

Advertisements

సంక్షోభం లో ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవాలి.కొలిమి లో ఉన్నప్పుడే బంగారం మెరుస్తుంది. అలానే ఉంటాయి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు. రాష్ట్రాన్ని ఒక పక్క కేంద్రం మోసం చేసి, రాష్ట్రం లో ఉన్న పక్షాలు కేంద్రానికి జై కొట్టి సరెండర్ అయితే అంత కంటే సంక్షోభం ఉంటుందా? ఆయన ఎత్తుగడలకు లెక్క ఉంటుందా? చంద్రబాబు ఒకటి తర్వాత ఒకటి వ్యూహాలు వేగంగా మారుస్తున్నారు. నిన్న ఒక్క రోజు పర్యటనకి సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు అక్కడ కేంద్రానికి తొలి దెబ్బ వేసారు.కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసారని


బిజెపిని మోడీని అంతర్జాతీయ వేదిక పై ఎండకట్టారు. మోడీ దేనికి ప్రమాదకరమో చెప్పారు. అంతే కాకుండా వాళ్ళ సహకారం లేకుండా రాష్ట్ర ప్రజల సహకారంతో అద్భుతం అయిన రాజధాని నిర్మిస్తా అని చెప్పారు. ఇక రెండవ దెబ్బ, మూడు రోజుల క్రితం ఆంధ్రుడు లో చెప్పినట్టు తన పుట్టిన రోజు ఏప్రిల్ 20న ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఒక భారీ ప్లాన్ వేసారు.కేవలం రెండు రోజులు తాను ఢిల్లీలో పర్యటిస్తేనే దేశవ్యాప్తంగా చర్చ జరగటం, జాతీయ మీడియా అంతా ఫోకస్ చేయడం, కేంద్రం భయపడి ప్రదర్శనలు ఆపడం చూసి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గనుక రాజధానిలో ఆమరణ నిరాహార దీక్షకి దిగితే ఇప్పటికే కర్ణాటకలో ఎంతో కష్టపడి ఎన్నికలకి సిద్దమవుతున్న వేళ బీజీపీని ఇరుకున పెట్టచ్చు అని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట..ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈనెల 20న నా పుట్టినరోజు..సాయంత్రం వరకు దీక్ష చేస్తా. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కేంద్రం లాలూచీ, ముసుగు రాజకీయాలు చేస్తోంది. నన్ను విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీకి లేదు. కొత్తగా వచ్చిన ఓ పార్టీ కూడా మాపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనే బంద్‌కు పిలుపునిచ్చారు. అభివృద్ధికి విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేద్దాం. కేంద్రంపై రాజీలేని పోరాటానికి ప్రజలు సహకరించాలి. రాజకీయాల్లో మోదీ నాకంటే

జూనియర్. 1995లోనే నేను సీఎం అయ్యా..2002లో మోదీ సీఎం అయ్యారు. 25 మంది ఎంపీలున్న రాష్ట్రాన్ని బీజేపీ కాదనుకుంటోంది. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని శాసించేది మనమే. చంద్రబాబు గనుక దీక్ష ప్రారంభిస్తే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం దీక్ష మొదలుపెట్టిన మొదటి ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలచిపోతారు.అంతే కాకుండా మోడీ దుర్మార్గం దేశం అంతా తెలిపేందుకు ఈ దీక్ష మరింత సహాయం చేస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలని, దీక్ష తీరు తెన్నులు మీద ఇప్పటికే ప్రత్యేక బృందం ఒకటి కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisements

Leave a Reply