ఛలో బుల్లెట్ రివ్యూ

ఎప్పుడో 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడేతో తొలి విజయం నమోదు చేసిన నాగ శౌర్య, 2016లొ వచ్చిన జ్యో అచ్యుతానంద తో పర్లేదనిపించాడు, ఈ రెండు కాక అతని కెరీర్లో చెప్పుకునే సినిమాలు ఏమి లేవు. కాని ఉన్న యువ నటుల్లో మంచి ప్రతిభ కల నటుడు అని చందమామ కథలు మూవీ లో కామియోతో ప్రూవ్ చేసాడు. ఆటను చాలా ఆశలు పెట్టుకుని చేసిన చిత్రం “ఛలో”. వెంకి కుడుముల దర్శకుడు గా పరిచయం అయ్యాడు. చూసి చూడంగానే పాటతో అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం ఎలా ఉందొ,అంచానాలు అందుకుందో లేదో మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

హీరో, హీరోయిన్ నటన బాగున్నా వారి మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు.

మొదటి సగంలో పోసాని, రెండవ సగంలో వెన్నెల కిషోర్ కామిడి కొద్దివరుకు పరువాలేదు.

రెండు భాషల వారు, రెండు ప్రాంతాల వారు ఒకరినొకరు ద్వేషించుకోవడానికి గల కారణాలు సిల్లీగా ఉన్నాయి.

పాత కథ , కథనాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.

సినిమాలో అనవసరమైన సన్నివేశాలు రావడంతో చూసే ప్రేక్షకుడికి ఆసక్తి కలగదు.

అందంగా ఉన్న హీరోయిన్ కళ్లజోడులో అంద వికారంగా కనిపించింది.

ఈ చిత్రం తో పరిచయం అవుతున్న వెంకి కుడుముల అన్ని రకాలు గాను ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి.

ఓవరాల్ గా చుస్తే తోలి సినిమా చేసే డైరెక్టర్ ఏమేమి ఆశిస్తాడో అన్ని సమకూరాయి. మంచి మ్యూజిక్ డైరెక్టర్ (సాగర్),ఖర్చు కి వెనుకాడని నిర్మాత, అద్భుతంగా చూపించే కెమెరా మెన్ (సాయి శ్రీరామ్) అందరు ఉన్నారు. సినిమా ప్రమోషన్స్, హైప్ చూసి ఈ సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. చిత్రం మీద ఉన్న అంచనాలు ఏ దశలోనూ అందుకోలేదు.

రేటింగ్ : 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here