ఛల్ మోహన్‌రంగ బుల్లెట్ రివ్యూ

Advertisements

నితిన్, మేఘా ఆకాష్ జంటగా వచ్చిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. కృష్ణ చైతన్య దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథను అందించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవర్ స్టార్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చి్ంది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యు లో చూద్దాం…

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

నితిన్ నటన గురించి కొత్తగా చెప్పుకోటానికి ఏమి లేదు, పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు

మేఘా ఆకాష్ బావుంది, నటన పరం గా హైలేట్ చేసి చెప్పటానికి ఏమి లేదు

సంగీతం ఈ సినిమా కి ఒక పెద్ద అసెట్

చాయాగ్రహణం చాలా బావుంది, ముఖ్యం గా అమెరికా లో షూట్ చేసిన సన్నివేశాల్లో చాయగ్రాహకుడి పని తీరు బావుంది

రౌడీ ఫెలో లాంటి సీరియస్ చిత్రం తో డెబ్యు చేసిన కృష్ణ చైతన్య, ఈ చిత్రం లో వీలు అయినంత ఎంటర్తైన్మెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు

త్రివిక్రం కథ అని ఎక్కడ మెన్షన్ చెయ్యకపోతే బావుండేది, ఎక్కడ వెతికినా కథ కనిపించలేదు.

ఒక రొటీన్ కథని ట్రీట్మెంట్ తో నడిపించాల్సిన దర్శకుడు కృష్ణ చైతన్య తడబడ్డాడు

హీరో హీరోయిన్లు విడిపోయే సన్నివేసం బలం గా చెప్పాలి, కాని అక్కడ ఎమోషన్ క్యారి అవ్వలేదు.

ఎడిటింగ్ కుడా బావుంది

మొత్తానికి ఒక మంచి కథ తప్పితే అన్ని ఉన్నాయి ఈ సినిమాలో. త్రివిక్రమ్ ఇచ్చిన పేలవమైన కథ, దానిని పట్టు సడలకుండా చెప్పటం లో తడబాటు కి గురి అయిన దర్శకుడు ఈ సినిమా కి నెగెటివ్ గా నిలిచాయి. కాని దర్శకుడు  కృష్ణ చైతన్య రాసుకున్న కామెడి, అమెరికా లోకేషన్స్, సంగీతం, ఛాయా గ్రహణం ఉంటె చాలు, కథ లేకపోయినా ఓకే అంటే చూడండి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5

Advertisements

Leave a Reply