BREAKING : కర్ణాటక ఎఫెక్ట్ : కేంద్రం నుంచి రాష్ట్రానికి మరొక శుభవార్త

విభజన హామీలపై పోరు ముదిరాక, బిజెపి, వైకాపా, జనసేన ఒక జట్టుగా తెలుగు దేశం మీద విమర్శలు తీవ్రతరం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా కాని చంద్రబాబు నాయకత్వం లోని తెలుగు దేశం పోరు ఆపలేదు, ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే ఉంది. చంద్రబాబు కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిన వారికి ఓటు వెయ్యకండి అని పిలువు ఇవ్వటం, అన్నట్టుగానే కర్ణాటక లో ఉన్న ఆంధ్రులు బిజెపి కి వోట్ వెయ్యకపోవటం జరిగింది. దానితో తెలుగు వారి ప్రభావం అధికం గా ఉన్న స్థానాలు కోల్పోయి బిజెపి అధికారానికి 9 స్థానాల దూరం లో నిలిచింది.విభజన హామీలపై పోరు ముదిరాక, బిజెపి, వైకాపా, జనసేన ఒక జట్టుగా తెలుగు దేశం మీద విమర్శలు తీవ్రతరం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా కాని చంద్రబాబు నాయకత్వం లోని తెలుగు దేశం పోరు ఆపలేదు, ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే ఉంది. చంద్రబాబు కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిన వారికి ఓటు వెయ్యకండి అని పిలువు ఇవ్వటం, అన్నట్టుగానే కర్ణాటక లో ఉన్న ఆంధ్రులు బిజెపి కి వోట్ వెయ్యకపోవటం జరిగింది. దానితో తెలుగు వారి ప్రభావం అధికం గా ఉన్న స్థానాలు కోల్పోయి బిజెపి అధికారానికి 9 స్థానాల దూరం లో నిలిచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావమో ఏమో తెలీదు కాని, అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం భూసేకరణ బిల్లు కి ఆమోదం పొందిన రాష్ట్రం కి ఇది మరొక విజయం గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here