YOU WILL DIE LAUGHING : జగన్ మోహన్ రెడ్డి కెరీర్ బెస్ట్ సెల్ఫ్ గోల్ రేపు వెయ్యబోతున్నాడట

2009 లో తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలవ్వగానే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేసాడు అని ఇప్పటికి కూడా ఆరోపణలు ఎదురుకుంటూ ఉంటాడు జగన్ మోహన్ రెడ్డి. అందుకే మార్చ్ 12 2011 లో అధికార సాధనే లక్ష్యం గా ముఖ్యమంత్రి అవ్వటమే ధ్యేయం గా వైకాపా ను సైతం స్థాపించాడు. అయితే జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు గా ఉండి ప్రతి శుక్రవారం కోర్ట్ వాయిదాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ లో మరొక కీలక నేత విజయ సాయి రెడ్డి జగన్ ఉన్న కేసుల్లోనే A2 గా ఉన్నాడు. ఆర్ధిక నేరస్తులుగా తీవ్రం అయిన ఆర్ధిక నేరాలు చేసినట్టు ఆరోపణలు ఎదురుకుంటున్నారు.

అయితే రేపు ఆ వైకాపా ఆవిర్భావ సభ జగన్ స్టువర్ట్ పురం లో పార్టి జండా ఎగరవేసి ప్రారంభిస్తారని సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు పార్టి ఆవిర్భావ సమావేశానికి హాజరు అవుతారని సమాచారం. ఇదే వార్తా ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇందులో నిజా నిజాలు ఏంటి అనేది తెలీకపోయినా “స్టువర్ట్ పురం దొంగలు” అనే భాను చందర్ సినిమా పోస్టర్ పెట్టి మీమ్ లు చేస్తున్నారు. అంతే కాక కరెక్ట్ గా పాదయాత్ర అదే రోజున అదే ఊరిలో ఉండటం, అక్కడే జండా ఎగరవేయ్యటం వైఎస్సార్ ఆశీస్సులతో జరుగుతుంది అని, ఇది ఒక అద్భుతం అని జోకులు పేలుస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం స్టువర్ట్ పురం లో ఉండే అందరు దొంగలు అని కాదని, అలా మాట్లాడటం తప్పని వారిస్తున్నారు. మరొక పక్క స్టువర్టుపురంలో ఎటు చూసినా ఫ్లెక్సీలు. జెండాలు రెపరెపలతో సందడిగా ఉందట. వైకాపా ఆవిర్భావ, మరియు వార్షిక సమావేశం కావటం తో రాష్ట్రం నలు మూలల నుంచి అందరు వస్తున్నారట. ఆ ఊరంతా స్వాగత తోరణాలే. అక్కడ పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పుడంటే దొంగతనాలకు మానేశాం కానీ… ఒకప్పుడు మనమేంటి..? మన ఊరు చరిత్రేంటి? రాష్ట్రాన్ని వణికించిన గజదొంగల పుట్టినిల్లు స్టువర్టుపురం అంటూ జోకులు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here