BREAKING : మార్చ్ 1 నుంచి మీకు సినిమా ధియేటర్లలోకి NO ENTRY

మీరు సినిమా అభిమానా? అయితే మీకు సినిమా ధియేటర్లలోకి NO ENTRY. అతి పెద్ద సంక్షోభం మిమ్మలని సినిమా చుడనిచ్చేలా లేదు. క్యూబ్/యుఎఫ్ఓ/పిఎక్స్ డి లాంటి డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ధియేటర్ ఓనర్ల నుంచి రక్తం పిండుతూ వసూలు చేస్తున్న అధిక ధరలను వ్యతిరేకిస్తూ జరుగుతున్నా పోరాటంలో కీలక మలుపు వచ్చింది.ప్రస్తుతం డిజిటల్‌ ప్రొజక్షన్‌ నిమిత్తం డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు రూ.20వేల నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇది చాలా అధికమని…

దీనివల్ల నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు భారీ నష్టం ఏర్పడుతోందని సీనియర్‌ నిర్మాతలు ఆరోపిస్తున్నారు.ఈ సమ్మెలో దక్షిణాదిలో ఇతర సినీ పరిశ్రమలు కూడా పాల్గొనాలని వారు ఇచ్చిన పిలుపు మేరకు,తమిళ సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. ఈ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టాలీవుడ్‌ పిలుపునిచ్చిన సమ్మెకు తమిళ చలన చిత్ర వాణిజ్య మండలి మద్దతు తెలిపింది. అయితే సమ్మెపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కన్నడ,మలయాళ పరిశ్రమల నిర్ణయం సాయంత్రానికి తెలియవచ్చు. సినిమా మీద ఆధారపడిన డిజిటల్ ప్రొజెక్షన్ వ్యాపారం సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తూ ధరలు డిక్టేట్ చెయ్యటం తప్పు అని నిర్మాతల వాదన. వచ్చే మార్చి 1వ తేదీ నుంచి థియేటర్లను మూసివేయాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఆమోద యోగ్య మైన ధరలు వసూలు చేయడానికి ముందుకువస్తే సమ్మె చేసే అవసరం ఉండదని రెండు పరిశ్రమలు భావిస్తున్నాయి. అయితే దీని మీద స్పందన ఇవ్వని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అందరు ఒక సిండికేట్ గా మారి, ఎంత దూరం అయిన తెసుకుని వెళ్దాం అని భావిస్తున్న్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న వాదోప వాదాల నడుమ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాని మీద ఏమి స్పందించని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వివాదాన్ని పెంచటానికి చూస్తున్నారు. ఇప్పుడు ఈ బెదిరింపులకి భయపడి ధరలు తగ్గితే తమ దోపిడీ ఆగిపోతుందని భయపడుతున్నట్టు గా తెలుస్తుంది. పెద్ద సినిమా రిలీజ్ ఉన్న దృష్ట్యా ధియేటర్ ఓనర్స్ తగ్గి వస్తారని భావిస్తున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ వివాదంకా సినిమా ప్రేమికులకు ఎడబాటు తప్పేలా లేదు. త్వరలోనే ఈ గొడవ ఒక కొలిక్కి రావాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here