BREAKING : పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

మోహన్ బాబు గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు, ముక్కు సూటి గా మాట్లాడే ఆయన తనకి తప్పు అనిపిస్తే ప్రశ్నిస్తారనే పేరు ఉంది. ఆయన ఎవరినైనా లెక్కలేకుండా అనేయ్యగలరు. అలానే 2007 లో జరిగిన తెలుగు చిత్రపరిశ్రమ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు ఇన్వాల్వ్ అయిన వివాదం తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద వివాదం గా ఉంది. ఆ వేదిక మీద చిరంజీవి కి లెజెండ్ అవార్డ్ ఇచ్చి మోహన్ బాబు ని సెలెబ్రిటి అన్నప్పుడు, మోహన్ బాబు రియాక్ట్ అవుతూ, చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు, కారక్టర్లు…

ఎక్కువ చేసాను.నేను దేనికి లెజెండ్ కాదు, చిరంజీవి ఎలా లెజెండ్ అని మోహన్ బాబు చేసిన స్పీచ్ ఇప్పటికి పాపులర్ స్పీచెస్ లో ఒకటి. కాని మోహన్ బాబు అంత పెద్ద వేదిక నుంచి చిరంజీవి ని ప్రశ్నించడం వివాదానికి దారి తీసింది. ఆనాడు దానిపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. “తమ్ముడు” మోహన్ బాబు అంటూ కాస్త నవ్వుతూ మాట్లాడారు. ఆ ‘తమ్ముడు’ వ్యాఖ్యలపైనే మోహన్ బాబు తాజాగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు స్పందించారు. ఆనాటి విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను. ఆ సమయంలో పవన్ అలా అన్నప్పుడు ఆనందించాను, సంతోషించానన్నారు.ఎందుకన్నాడా అని కొద్దిసేపు ఆలోచించానని .. కొన్ని వినీ విననట్టు వదిలేయాలని వదిలేశానన్నారు. ఆ విషయాన్ని పవన్ విజ్ఞతకే వదిలేశాను అన్నారు. పవన్ కళ్యాణ్ అలా సీనియర్ ని అన్న ఆలోచన లేకుండా కామెంట్స్ చెయ్యటం అతని విజ్ఞత అని వదిలేసా అని చెప్పారు. అయితే ఇప్పుడు దానిపై తనకు ఎలాంటి ఆలోచన లేదని మోహన్ బాబు తెలిపారు.అది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. అయితే దాదాపు పదేళ్ళ తర్వాత మోహన్ బాబు స్పందించటం దేనికి అని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం నిజం గా మోహన్ బాబు అప్పుడే వదిలేస్తే ఈ రోజు దేనికి మాట్లాడాల్సి వచ్చిందో మోహన్ బాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం అని కౌంటర్లు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here