BIG BREAKING : మార్చ్ 5 లోపు ఆంధ్ర కి ఇవ్వాల్సినవి అన్ని ఇస్తాం, కేంద్రం ప్రకటన వివరాలు

Advertisements

తెలుగు దేశం ఎంపిలు ఎదుర్కొంటున్న సమస్యల పై తెలుగు దేశం చేస్తున్నా ఆందోళన ఫలించినట్టే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎదుర్కొంటున్న విభజన సమస్యల ప‌రిష్కారానికి ఈ రోజు సుమారు రెండున్న‌ర గంట‌ల‌పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుజ‌నా చౌద‌రి, పియూష్ గోయ‌ల్‌, బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా భేటి అయ్యారు. ఎపికి ఇవ్వాల్సిన నిధులు, ప‌లు సంస్థ‌లు, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌ జరిగినట్టు గా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే…..

పార్ల‌మెంటు నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవాల‌నే ఉద్ద‌శ్యంతోనే… ప‌లు మంత్రిత్వ శాఖ‌ల అంశాల ప్ర‌స్తావ‌న చేయ‌కూడ‌ద‌ని,అర్ధం చేస్కోవాలని భేటీలో పేర్కొన్న జైట్లీ.రెండో ద‌శ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం లోపు…..అన్ని ప్ర‌క‌ట‌న‌లూ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించిన‌ ఉన్నత స్థాయి వర్గాలు.వాళ్ళు చెప్పే వార్తల ప్రకారం జరగబోయేది ఇది.ఆంధ్రప్రదేశ్ కోరున్తున్నట్టు, రెవెన్యూ లోటు పూర్తి చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంది. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్ర‌కారం 2014-15 ఏడాదిలో ప‌దినెల‌ల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించినట్లు తెలుస్తుంది. గ‌త మూడేళ్ళ నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేసేందుకు, మిగిలిన మొత్తాన్ని ప్ర‌తి ఏటా విడుద‌ల చేసేందుకు అంగీకరించినట్టు గా తెలుస్తుంది. దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంత‌రాలు లేవనేత్తిందని, అక్క‌డ కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్క‌డ సూచిస్తే అక్క‌డ పోర్టు నిర్మాణానికి సిద్దంగా ఉన్నామని కేంద్రం నుంచి ఖచ్చితమైన హామీ ఇస్తున్న‌ట్లు తెలిసింది. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి వ‌చ్చే నిధుల మొత్తాన్ని ఒకే సారి ఇచ్చేందుకు సంసిధ్ద‌త వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌త్యేక ప్యాకేజి ప్ర‌కారం ఈఎపి నిధుల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం స‌ర్దుబాటు చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు పేర్కొన్న‌విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు.. ఆ నిధులు కూడా వెంట‌నే విడుద‌ల చేసేందుకు కూడా అంగీకారం తెలిపినట్టు గా తెలుస్తుంది. అంతే కాకుండా….

రైల్వే జోన్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న సాధ్యమైనంత త్వ‌ర‌లో ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ – ఛెన్నై, క‌డ‌ప – ఛెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వ‌స్తున్న అడ్డంకులు అన్ని తొలగించి… అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని డిసైడ్ అయినట్టు గా తెలుస్తుంది.పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 12శాతం నుంచి ఎంత ఎక్కువ సాధ్యం అయితే అంత వ‌ర‌కు ఐఆర్ త‌గ్గించుకోవాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు పంపార‌ని, ఇందుకు సంబంధించిన ఇంట‌ర్ ఆఫీస్ మెమోనే వెంట‌నే విడుద‌ల చేయాల‌ని సంబంధిత మంత్రిత్వ శాఖ‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భేటీలో వెల్ల‌డి అయినట్టు గా తెలుస్తుంది.క‌డ‌ప ఉక్కు క‌ర్మగారం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో నిర్మించాల‌ని… ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌నే దీనికి ప్ర‌ధాన ఉద్దేశమ‌ని పేర్కొన్న‌ట్లు తెలిసింది. క‌ర్మాగార నిర్మాణానికి కావ‌ల‌సిన నివేదిక మెకాన్ సంస్థ ఈనెల 12కి అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డి.అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు వివ‌రాలు పంపితే, ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం. పోల‌వ‌రం ప్రాజ‌క్టుకు ఇప్ప‌టికే ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని, దాని ప్ర‌కారం నిదుల‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, ఆ ప్రాజ‌క్టును అనుకున్న రీతిలో పూర్తి చేయ‌నున్న‌ట్లు బేటీలో చ‌ర్చ‌ జరిగింది అని తెలుస్తుంది. మొత్తానికి కేంద్రం అడుగు దిగినట్టే తెలుస్తుంది. అతి త్వరలో వీటికి సంబందించిన అంశాలు అన్ని కార్యరూపం దాలుస్తాయని ఆశిద్దాం.

Advertisements

Leave a Reply