నిన్న తిరుపతిలో రాష్ట్ర బంద్ సందర్భం గా తగలబడిన బైక్ వెనుక అసలు కథ తెలుసా?

Advertisements

చంద్రబాబు నాయుడు మనం నష్టపోకూడదు, అవసరం అయితే ఒక గంట ఎక్కువ పని చేద్దాం, ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే తోలు తీస్తా అని చెప్పారు. హింస కి తావు లేకుండా బంద్ చేస్కోమని చెప్పారు. అరగంట బంద్ చేసి గంట ఎక్కువ పని చెయ్యమని పిలుపు ఇచ్చారు. అయితే అసలు బంద్ కి పిలుపు ఇచ్చిందే హింస ని ప్రేరేపించి, అశాంతి రేకేత్తించటానికి అని కొందరికి స్పష్టత ఉంది. అందుకే బంద్ ప్లాన్ చేసినప్పటి నుంచి హింసని ప్రేరేపించటం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన

యాత్రికులు వచ్చే తిరుపతి ని, అందునా నెహ్రు బస్ స్టాండ్ ని ఎంచుకున్నారు. ఇక్కడ ఎదో విపరీతం అయిన హింస జరుగుతుంది అని కలర్ ఇవ్వటమే ముఖ్య ఉద్దేశం అంట. ఆంధ్రలో అశాంతి రేగితే లాభం ఎవరికో మీకు ప్రత్యేకం గా చెప్పే పని లేదు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించింది, తగిన జాగ్రత్తలు తీసుకుంది. అయితే సంఘటన వివరాల్లోకి వెళ్తే బస్ స్టాండ్ ముందు ఒక బైక్ తగలబడుతుండగా పోలీసులు ఆర్పేశారు.అయితే ఎవరు ఆ ఘటన చేసారు అని బైక్ రిజిష్టర్ద్ నంబర్ తో చెక్ చెయ్యగా ఆ బైక్ ని శనివారం సాయంత్రమే తిరుపతి లోని ఒక మెకానిక్ షెడ్ లో రాజేష్ రెడ్డి, కార్తిక్ రెడ్డి అనే మిత్రులు ఇద్దరు కొన్నారని తెలిసింది. ఆ బైక్ రన్నింగ్ కండీషన్ లో కూడా లేదని, తాత్కాలిక రిపేర్లు చేసి ఇస్తే చాలు అన్నారని మెకానిక్ షెడ్ యజమాని తెలియ చేసాడట. రాజేష్ రెడ్డి, కార్తిక్ రెడ్డి ఒక రాజకీయ పార్టి నాయకుడి అనుచరులు అని, కేవలం హింస ని రేపటానికే బైక్ ని తగలపెట్టారని, కాని పోలీసుల అప్రమత్తత వల్ల వాళ్ళ ప్లాన్ సాగలేదు అని తెలుస్తుంది. ఇటువంటి పనుల వల్ల సదరు రాజకీయ పార్టీకి కూడా ఉపయోగం లేకపోగా, రాష్ట్రం నష్టపోతుంది అనే విషయం గమనించాలి. ఇటువంటి కుట్రపూరిత చేష్టల వల్ల ఎవరికీ లాభం చేకురుస్తున్నారో వారే ఆలోచించుకోవాలి.

Advertisements

Leave a Reply