BIG BREAKING : వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించనున్న కేంద్రం, అతి త్వరలో

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకం గా పెట్టిన ఒత్తిడి ఫలించినట్టే ఉంది. నిన్న రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రతిది మార్చ్ 5 కి ఇస్తాం అని ప్రకటించిన కేంద్రం, మరి కాసేపట్లో వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించే అవకాసమ ఉందని తెలుస్తుంది. దీనిపై ఇప్పటికి ఓడిసా ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్న కేంద్రం, ఆ చర్చలు ఒక కొలిక్కి రాగానే దీనికి సంబందించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో వైజాగ్(వాల్తైర్) రైల్వే జోన్ ఉంది.

వైజాగ్ రైల్వే డివిజన్ లో ఉన్న ఓడిసా కు చెందిన ప్రాంతాలను ఓడిసా కి వదిలేసి, ఈ రైల్వే జోన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రకటించే రైల్వే డివిజన్ లో ఓడిసా ప్రాంతాలను తీసేసాక మిగిలిన వైజాగ్ డివిజన్ తో పాటు, గుంటూరు రైల్వే డివిజన్, విజయవాడ రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్ తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు గా తెలుస్తుంది. రైల్వే మంత్రి పియూష్ గోయల్,సుజనా చౌదరి, ఓడిసా కు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చించినట్టు తెలుస్తుంది. పియూష్ గోయల్ చంద్రబాబు ని అమితం గా ఆరాధిస్తారు అనేది ఇక్కడ గమనార్హం. ఈ రైల్వే జోన్ కి సంబంధించి రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల అవుతున్నట్టు గా తెలుస్తుంది. ఈ ప్రకటన తో విభజన చట్టం లో ఉన్న కీలక హామీలలో ఒకటి తీరినట్టు. ఇదే ప్రకటన లో మిగతా వివరాలు కూడా తెలిసే అవకాసం ఉంది. దీనితో ఇది మిత్రపక్షం గా ఉంటూ తెలుగు దేశం ఎంపిల నిరసన ద్వారా సాధించిన తోలి విజయం గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here