బాలయ్య సర్జరీ విజయవంతం,పూర్తి వివరాలు…

బాల‌క్రిష్ణ‌కి ఈ రోజు జరిగిన శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం అయ్యింది.రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న బాల‌క్రిష్ణకి ఈ రోజు గంట‌పాటు శస్త్ర చికిత్స జరిగింది.ఈ రోజు ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్ లో ఈ మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ లో గాయాల‌కు గురైన ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో చాలా రోజుల నుంచి బాధ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న ఆయ‌న‌కు మేజ‌ర్ స‌ర్జ‌రీ నిర్వ‌హించాల‌ని వైద్యులు తేల్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పైసా వసూల్,జైసింహా చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు.అప్పుడు కనుక సర్జరీ పెట్టుకుంటే నిర్మాతలకి నష్టం అని ఆగిన బాలయ్య ఈ స‌ర్జ‌రీ చేయించుకోలేకపోయారు.కాని ఈ నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌వ‌డంతో స‌ర్జ‌రీ అనివార్య‌మ‌య్యింది. ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌క్రిష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్ కి ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు చేరుకున్నారు.చేరుకున్న వెంటనే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే) ఆయ‌న కుడిచేయికి స‌ర్జ‌రీ నిర్వహించారు.బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here