EXCLUSIVE : అ! స్పెషల్ షో రివ్యూ

Advertisements

హీరో నాని నిర్మాతగా మారి చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ‘అ!’. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని కేవలం నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాదు ఇందులో చేప పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారు. ఫిబ్రవరి 16న (అంటే రేపు) ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిన్న రాత్రి స్పెషల్ ప్రివ్యూ షో ని నాని తన సన్నిహితులకి ఏర్పాటు చేసాడు.ఆ షో నుంచి వచ్చిన రిపోర్ట్ ఇదే.

ఈ చిత్రంలో హీరో ఎవరు? అంటే ఎవరూ లేరు…. కథే ఈ చిత్రానికి హీరో అని నాని తెలిపారు. సినిమా కథల ఎంపిక విషయంలో నానికి మంచి అనుభవం ఉంది. అలాంటిది తానే డబ్బులు పెట్టిన నిర్మిస్తున్న ఈ చిత్ర కథ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి కథ ఎన్నుకున్నారు అని తెలుస్తుంది. ఇందులో ఉన్న నటులు అందరు తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది. సాంకేతికం గా చాలా ఉన్నతం గా ఉన్న ఈ సినిమాకి, నిర్మాణ విలువలు కూడా బానే ఉన్నాయంటున్నారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ చక్కగా డీల్ చేసాడని సమాచారం. చెట్టు కి వాయిస్ యావర్ ఇచ్చిన రవి తేజ, చేపకి వాయిస్ ఇచ్చిన నాని ఈ చిత్రానికి ఎడ్వాంటేజ్ గా తెలుస్తుంది. మొత్తం గా ఒక మంచి సినిమా చుసిన అనుభూతి తో ప్రేక్షకుడు బయటకి రావటం ఖాయం అంటున్నారు. అయితే ఇది మల్టిప్లెక్స్ చిత్రం అని, కింద సెంటర్స్ కి నచ్చుతుందో లేదో అప్పుడే చెప్పలేం అని, కాని నిర్మాత గా నాని ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలని ఈ స్పెషల్ ప్రివ్యూ చూసిన అందరు అభిప్రాయ పడ్డారట. ఈ రోజు యు ఎస్ ప్రీమియర్స్ తో పాటు, రేపు ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రివ్యు రివ్యూ ఇది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె.రాబిన్‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌత‌మ్ నెరుసు, నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిరినేని, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌.అయితే ఈ షో నాని కి బాగా కావాల్సిన వాళ్ళకోసం వెయ్యటం తో దీనిలో వచ్చే రివ్యూ ని పూర్తీ గా నమ్మలేము.

Advertisements

Leave a Reply