AWE అ! మూవీ బుల్లెట్ రివ్యూ

హీరో నాని నిర్మాతగా మారి చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ‘అ!’. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని కేవలం నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాదు ఇందులో చేప పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారు. ముందు నుంచి వెరైటి చిత్రం అని చెప్పిన అ! కథ ఎంతో నచ్చి నాని నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం.


ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సినిమా ప్రారభం నుంచే ఒక కొత్త ఫీల్ ఇస్తుంది.

అందరి కొత్త గెటప్స్ తో పాటు, కథ లోకి తీసుకెళ్ళే విధానం కూడా బావుంది

నాని, రవి తేజ వాయిస్ ఓవర్స్ ఈ సినిమాకి ఒక ప్లస్

సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కొత్త ట్రీట్మెంట్ ఉంది

ఈ సినిమా అందరికి అర్ధం అవుతుందా కాలేదా పక్కన పెడితే ఇది ఒక కొత్త సినిమా.

బాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. అ! థీమ్ సాంగ్ చాలా బావుంది.

కెమెరా వర్క్ బావుంది. ఈ సినిమాలో ఒక ఫ్రెష్ నెస్ కనిపించటానికి కెమెరా వర్క్ ముఖ్య కారణం

కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక గొప్ప సినిమా కాకపోయినా ఒక మంచి సినిమా తో ఎంటర్ అయ్యాడు.

నాని ని మెచ్చుకోవాలి,ఒక కొత్త కథ ని ఎంకరేజ్ చేసినందుకు.

ఫాస్ట్ హాఫ్ పాసబుల్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ గొప్పగా లేదు.

క్లైమాక్స్ కి పూర్తీ గా నీరసపడిపోయింది. ఊహించిన స్థాయి లో లేదు క్లైమాక్స్

ఓవరాల్ గా చూస్తె అ! అనేది ఒక డిఫరెంట్ మూవీ. అందులో ఏమి సందేహం లేదు. కాకపొతే ఈ కొత్తదనం అని అందరు ఆదరిస్తారా లేదా అనేది పెద్ద డౌట్. మల్టీప్లెక్స్ లో నాని బ్రాండ్ నేమ్ మీద ఆడేస్తుంది. బి,సి సెంటర్స్ లో ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఇది ఒక పర్టిక్యులర్ జోనర్ సినిమా గా చెప్పలేము.ఇది ఒక పెక్యులియర్ సినిమా.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here