కాపిరైట్ వివాదం లో అ? ఏ సినిమా నుంచో తెలుసా?

వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నిర్మాతగా మారి, తన సొంత బ్యానర్‌లో అ! సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, పోస్టర్లు, టీజర్ వరుసగా విడుదల చెయ్యడం, వాటితో అందరి చేత శభాష్ అనిపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చెయ్యనున్నట్టు నాని సమాచారం అందించారు.అయితే ఈ సినిమాపై కాపీ మరక పడింది. కాఫీ మరక కాదు… కాపీ మరక….

ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అని తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్ళ క్రితం హాలీవుడ్‌లో ‘రాట‌టూలి’ అనే ఓ యానిమేష‌న్ సినిమా వ‌చ్చింది. ఇంచుమించు ఆ క‌థ ,ఈ ‘అ!’ కథ ఒక్క‌టే అని టాక్‌.ఓ రెస్టారెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా అది. అందులో వంట వాడికి వంట రాదు. ఆ రెస్టారెంట్లో తిరిగే ఎలుక‌… వంట‌వాడికి స‌ల‌హాలు ఇస్తుంటుంది. అలా దాని మాట‌లు వింటూ… వంట చేస్తుంటాడు. అదో సెప‌రేట్ ట్రాక్‌. ఇంక ఈ రెస్టారెంట్ నేప‌థ్యంలో మిగిలిన క‌థలు నడుస్తాయి. ఈ లైన్‌నే దర్శకుడు ప్రశాంత్ వర్మ లేపేశాడని సినీ వర్గాల టాక్.అయితే అజ్నాతవాసి తర్వాత ప్రతి తెలుగు సినిమా కాపి అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భరత్ అనే నేను, నా పేరు సూర్య కూడా కాపిలే అని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ వార్తలు అన్ని నమ్మే పని లేదని తెలుస్తుంది. కాజల్‌, నిత్యామినన్‌, రెజీనా, ఇషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్‌, మురళీశర్మ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని తోలి సరి నిర్మాత గా మారి నిర్మిస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ అయితే ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు మరిన్ని మనం చూడటానికి ఆస్కారం ఉంది. అయితే ఇంత వైవిధ్యమైన కథలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే దాని మీద కూడా ఈ చిత్ర విజయం తర్వాత స్పష్టత వచ్చే అవకాసం ఉంది. ఏది ఏమైనా చిత్ర ఫలితం కోసం ఇంకొక్క 10 రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here