Author: Andhrudu

మొన్న టిడిపి నుంచి జంప్, నిన్న జనసేన టికెట్ : ఇది పవన్ రాజకీయం

జనసేన పార్టీ తరపున గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీ నేత షేక్‌ జియావుర్‌ రెహ్మాన్‌ ఎంపిక దాదాపు ఖరారైంది. రెండు రోజుల కిందట ఆయన విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ను ఆదివారం రాత్రి జియావుర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన తరపున తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ […]

Read More

25 ఎంపీ,36 ఎమ్మెల్యే స్థానాలతో టిడిపి ఫైనల్ లిస్ట్ ఇదే, నామినేషన్ల పర్వం మొదలు

టీడీపీ తరపున లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు, అసెంబ్లీ బరిలోకి దిగే 36 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఎంపీల జాబితాలో కొన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం ఎంపీగా బరిలోకి దించారు. దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు ఎం.భరత్‌ను విశాఖ నుంచి, రాజమహేంద్రవరం సిటింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూపను అదే స్థానం నుంచి పోటీచేయిస్తున్నారు. నంద్యాల స్థానాన్ని గౌరు […]

Read More

25మందితో టిడిపి ఎంపీ అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదల

ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో.. అభ్యర్థుల జాబితా ప్రకటనలో పార్టీలు బిజీ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగతా ఏడు స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక త్వరలోనే కొలిక్కి రానుంది. 15 మంది సిట్టింగ్ ఎంపీల్లో 8 మంది మాత్రమే టీడీపీ నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, […]

Read More

పోటీ నుంచి తప్పుకుంటున్నానని వీడియో రిలీజ్ చేసిన టిడిపి ఎమ్మెల్యే : శ్రేణుల నిరసనలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ వచ్చిన తర్వాత ఆ నేత అస్త్ర సన్యాసం చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ అబ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆయన పేరును కన్ ఫాం చేశారు. అయితే, ఇప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు. తన భార్య శైలజ అనారోగ్యం […]

Read More

గుంటూరు టిడిపిలో వరుస ట్విస్ట్స్ : అభ్యర్థుల మార్పుపై లేటెస్ట్ అప్డేట్స్ ఇవే

గుంటూరు జిల్లా టీడీపీలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. దీంతో జిల్లాలో పలు సీట్లు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నివాసానికి ఎంపీ రాయపాటి చేరుకున్నారు. రాయపాటి కుమారుడు రంగబాబును గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేయించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో సైతం మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి అధిష్టానం మరికొందరి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆలపాటి […]

Read More

టిడిపికి ఝలక్ ఇచ్చిన మహిళా నేతకు వైకాపాలో ఘోర అవమానం

కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు వైసీపీలో నిరాశ ఎదురైంది. కర్నూలు లోక్‌సభ స్థానం లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం ఇస్తారన్న ఆశతో ఆమె వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల వరకు బుట్టా రేణుక ఎవరో జిల్లా ప్రజలకు తెలియదు. ఆ ఎన్నికల్లో కర్నూలు లోక్‌ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల కారణంగా టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ […]

Read More

చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చినా నాకు వద్దు : నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా

తనకు ఎమ్మెల్సీ ఇచ్చినా, మంత్రి పదవీ ఇచ్చినా ఇష్టం లేదని, కనిగిరి ఎమ్మెల్యే అంటేనే ముద్దు అని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తాను పార్టీకి చెందిన వ్యక్తిని అని, తాను పార్టీ మారే వ్యక్తిని కాదని సీఎం చంద్రబాబు తనకు టిక్కెట్టు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. మాగుంట పార్టీని వీడిపోవటం వలనే సీటు ఎంపికలో జాప్యం జరుగుతుందని […]

Read More

ఐదు ఎన్నికల్లో ఐదుగురు ప్రత్యర్ధులు ఐదు సార్లు టిడిపి ఎమ్మెల్యే విజయం, ఇది ఆరో సారి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పొన్నూరు నుంచి ధూళిపాళ్ల కుటుంబమే ఎన్నికల బరిలో నిలుస్తోంది. 1983, 1985, 1989 ఎన్నికల్లో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మూడుసార్లు పోటీచేసి 83, 85 ఎన్నికల్లో విజయం సాధించడ మే కాకుండా రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. వీరయ్య చౌదరి ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా 1994లో నరేంద్రకుమార్‌ రాజకీయ అరం గేట్రం చేశారు. 1994 ఎన్నికల బరిలో నిలిచిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా ఐదు […]

Read More

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తమ్ముడు ఎల్లుండి టిడిపిలోకి : జోష్ లో దేవినేని అభిమానులు

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ల పర్వం మొదలవుతున్న వేళ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. టిడిపి నుంచి వైకాపాకు, వైకాపా నుంచి టిడిపికి ఈ రెండిట్లో ఖాళి లేకపోతె జనసేనకు వరుసగా అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అలానే కొన్ని అసంతృప్తుల కారణంగా కొందరు దూరం జరుగుతున్నారు. మైలవరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వసంత వెంకట కృష్ణప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు సోదరుడయ్యే వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం […]

Read More

నంద్యాల పీటముడి విప్పిన చంద్రబాబు, భూమా ఫ్యామిలీకి షాక్?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 141 మందితో కూడిన రెండు జాబితాలను విడుదల చేశారు. కాగా.. ఆ జాబితాలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. కానీ. నంద్యాల మాత్రం పెండింగ్ లో పెట్టారు.నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి అఖిల్ ప్రియా సోదరుడు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే.. ఆయనకు తిరిగి ఈ 2019 ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అన్న విషయంలో క్లారిటీ లేదు. […]

Read More

గుంటూరు జిల్లాలో ప్రకటించిన సీట్లలో భారీ మార్పులు : ఎంపీగా ఆలపాటి? కొత్త లిస్ట్ ఇదే

గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రాయపాటి అలకతో ఈ స్థానంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తనకు ఎంపీ టికెట్‌తో పాటు కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నది రాయపాటి ప్రతిపాదన. అయితే.. జిల్లాలోని దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి. రాయపాటి లాంటి సీనియర్ నేతను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఎవరిని […]

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరేంటో జగన్ సార్ కి తెలుసు : సంచలనం రేపిన వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. హత్య అనంతరం ఎన్ని […]

Read More

మనసు మార్చుకున్న చంద్రబాబు, సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్?

తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్ఠానం మళ్లీ పునరాలోచనలో పడింది. తొలుత ప్రకటించిన జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్‌కుమార్‌ను అక్కడ నుంచి తప్పించి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే బాపట్ల సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న శ్రీరామ్‌ మాల్యాద్రిని తాడికొండ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే శ్రావణ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు ఎంత మంది ఉన్నారో…. అంతకు రెట్టింపు నేతలు శ్రావణ్‌ అభ్యర్థిత్వాన్ని బలపర్చడంతో పాటు తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు […]

Read More

ఒకే ఎంపీ సీట్ కి వెయ్యి మంది అభ్యర్థుల నామినేషన్

కల్వకుంట్ల కవితపై 1000 మంది పోటీకి సిద్ధమవుతున్నారు. వారు ఎవరో కాదు.. నిజామాబాద్‌కు చెందిన అన్నదాతలు. వీరంతా తమ నిరసనను తెలిపేందుకు నూతన మార్గాన్ని ఎంచుకున్నారు. బ్యాలెట్‌ పోరుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. పసుపు, ఎర్రజొన్న మద్దతుధర కోసం అన్నదాతలు ఈ నిర్ణయానికి వచ్చారు. నిజామాబాద్ లోక్‌సభ బరిలో సిట్టింగ్ ఎంపీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతరు కవిత బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోటీకి 500 నుంచి 1000 నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు […]

Read More

జగన్ మీద ఆగ్రహం : మా సత్తా చూపిస్తాం అంటూ పార్టీని వీడుతున్న ముగ్గురు నేతలు

ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లిస్తామని డబ్బులు ఖర్చుపెట్టించి.. తర్వాత పక్కనపెట్టారంటూ వైసీపీలో పలువురు నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పదవులు కట్టబెట్టి ఇన్నాళ్లూ మీటింగ్‌లు, పాదయాత్రలకు తమతో ఖర్చు చేయించి ఇపుడు కరివేపాకుల్లా తీసిపారేశారంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం వైసీపీ టికెట్‌ ఇస్తామని దవులూరి దొరబాబుకి కోఆర్డినేటర్‌ పదవి ఇచ్చారని.. తీరా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన తోట వాణికి టికెట్‌ ఇచ్చారంటూ దవులూరి వర్గం ఆగ్రహంతో ఉంది. […]

Read More