అర్జున్ రెడ్డి 13.6 కుటుంబ కథా చిత్రం : ఇదిగో దిమ్మ తిరిగే సాక్ష్యం

Advertisements

కుర్ర హీరో విజయ్ దేవరకొండని రాత్రికి రాత్రే స్టార్‌ని చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఇది తెలుగు రాష్ట్రాల యూత్ ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో, వారి మనసులను ఏవిధంగా కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది..? ఆ సినిమా కలెక్షన్లు చూస్తే మతిపోతుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్ళ వర్షం కురిపించింది.దర్శకుడు వంగా సందీప్ రెడ్డికి, హీరో విజయ్ దేవరకొండకి, హీరోయిన్ షాలిని పాండేకి విపరీతమైన క్రేజ్ సంపాదించి పెట్టింది. అయితే ఈ సినిమా కుటుంబ కథా చిత్రమా అనే సందేహం వస్తుంది.దేనికంటే

అంతటి క్రేజ్ ఉన్న సినిమా బుల్లితెరలో ప్రసారమైతే ఇంకే రేంజ్‌లో టీఆర్పీ వస్తుందో ముందుగానే ఊహించిన ‘స్టార్ మా’ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుంది.
అయితే సినిమా రిలీజ్ సమయంలోనే బూతు సినిమాగా గట్టి ప్రచారం జరగడంతో బుల్లితెర ప్రేక్షకులు చూడరేమో అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తాయి.దీనిని దృష్టిలో పెట్టుకునే సినిమాలో నుండి బూతు డైలాగులు, ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలను కత్తిరించారు. ఇక దీనితో చాలామంది కుర్రకారు సినిమాని చూడలేదు. కత్తిరింపులు అయినా మంచి ప్రేమ కథా చిత్రం కావడంతో 13.6 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. అన్ని కట్ అయ్యాక ఇది కుటుంబం తో కలిసి చూసే ప్రేమకథా చిత్రం గా తయారయ్యింది, అందునా స్టార్ మా నేషనల్ నెట్వర్క్ కాబట్టి సెన్సారింగ్ చాలా గట్టిగా చెయ్యాల్సి ఉంటుంది. ఏదిఏమైనా టిఆర్పిలతో దుమ్ము రేపింది.

Advertisements

Leave a Reply