అమిత్ షాకు కర్ణాటకలో మరొకమారు తీవ్ర అవమానం మొహం మీదనే చెప్పేశారు

Advertisements

కరెక్ట్భా గా నాలుగేళ్ల క్రితం బిజెపి అంటే ఒక వేవ్, కాంగ్రెస్ ని కప్పి పెట్టేసిన అల. దేశం లో చాలా అరుదుగా వచ్చే ఆబ్సల్యూట్ మెజారిటి వచ్చింది బిజెపి కి. అంటా కలిపి నాలుగేళ్ళు కాలేదు, బళ్ళు ఓడలు అయ్యాయి, ఓడలు బళ్ళు అయ్యాయి.భారతీయ జనతా పార్టీకి దేశంలో రోజురోజుకీ రోజులు దగ్గరపడ్డాయి అని స్పష్టం గా తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎటు చూసిన ఎదురు దెబ్బలు తగులుతున్న నేపధ్యంలో కనీసం సెలెబ్రిటి స్టేటస్ తీసుకుని వచ్చి ఎన్నికలు గట్టేక్కటానికి చెయ్యని ప్రయత్నం లేదు.


ఆ నేపధ్యంలోనే స్వయంగా అమిత్ షా కాల్ చేసి క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లను తమ పార్టీలోకి తీసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసారు. ఇప్ప‌టికే ప్రీ పోల్స్ స‌ర్వేలు మళ్లీ అక్క‌డ కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిల‌బెట్టుకుంటుంద‌ని చెపుతున్నాయి. తాజాగా వచ్చిన ఇండియా టుడే సర్వే మాత్రం హంగ్ వ‌స్తుంద‌ని చెప్తుంది.ఈ క్ర‌మంలోనే అక్క‌డ బీజేపీ మీద నమ్మకం తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సెలెబ్రిటిలను పార్టీ లోకి తెచ్చేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ క్రికెట‌ర్లు అయిన రాహుల్ ద్ర‌విడ్‌, అనిల్ కుంబ్లేల‌కు ఆయ‌న స్వ‌యంగా ఫోన్ చేసి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. అయితే వారు బీజేపీ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఎన్నిసార్లు చర్చించినా భారతీయ జనతా పార్టీలోకి రావడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున టెంపరరీ గా ప్రచారం చేయాలని ఆఫర్ ఇచ్చినా కానీ,వీరు మాత్రం వారు ఇచ్చిన ఆఫర్లకు తలొగ్గకుండా రాజకీయ బురదలో పడకుండా సూటిగా మొహం మీదే రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని తేల్చేశారు.అయితే దక్షిణాదిలో బీజేపీ పతనం ప్రారంభం అవడంతో ఆ పార్టీ పెద్దలు ప్రజల అభిమానాలు ఉండే వ్యక్తులకు ఎరవేస్తూ పార్టీలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారట. కానీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్ష

ప్రతి ఒక్క దక్షిణాది రాష్ట్ర ప్రజలకు అలాగే ప్రముఖులకు తెలియడంతో భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లడానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇక చాలా మంది సీనియ‌ర్ పొలిటిషీయ‌న్లు కూడా బీజేపీలో ఉంటే త‌మ‌కు ఫ్యూచ‌ర్ ఉండ‌ద‌న్న నిర్ణయానికి కూడా వ‌చ్చేస్తున్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తీవ్రంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉండే తెలుగువారు ఎన్నిక‌ల్లో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఖ‌చ్చితంగా ఆంధ్రాలో బిజెపి పార్టీకి నూకలు లేవు…ఇప్పుడు కర్ణాటకలో కూడా భారతీయ జనతాపార్టీని గెలవకుండా అడ్డుకోవాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారట. మొత్తం పరిస్థితులు చూస్తుంటే దేశంలో బీజేపీ పార్టీ ఖాళీ అయ్యేటట్టు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తెలిసిందే. గత ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తున్నాడు. కేరళలో భాజపా ఉనికే లేదు . స్వయంగా అమిత్ షా ఫోన్ చేసి మరీ బతిమాలినా కుంబ్లే , ద్రావిడ్ పార్టీలోకి రామ‌ని చెప్పారంటే బీజేపీ అంటే ఎవ్వ‌రికి ఇష్టం లేద‌ని తేలిపోయింది. అమిత్ షా వృదా ప్రయత్నాలు చూసి, చెప్పింది చేసి నమ్మకం పొందాలి కాని ఇలా అందరిని అడగటం దేనికి అని పెదవి విరుస్తున్నారట. దక్షిణ భారతదేశం లో అమిత్ షా మీద అంత ఆగ్రహం గా దేనికి ఉన్నారో తెలీదు కాని, మోడీ కంటే ఎక్కువ గా అమిత్ షా మీద విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. జాతీయ పార్టి అధ్యక్షడు స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి రమ్మంటే రాము అని చెప్పటం అమిత్ షాకు అవమానం కాక మరేంటి అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Leave a Reply