ప్రదీప్ కి ట్రాఫిక్ పోలీస్ బాస్ సీరియస్ వార్నింగ్

Advertisements

టాలెంటెడ్ యంగ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కి కొత్త సంవత్సరం చాలా బాడ్ గా మొదలయ్యి, అంతకంటే భారం గా గడుస్తుంది. మొన్నటి వరకు పరారీ లో ఉన్నాడని భావించిన ప్రదీప్ సడెన్ గా నిన్న ఉదయం నేను ఉన్నాను, బిజీగా ఉన్నాన్ను, అన్ని లీగల్ గానే ఫాలో అవుతాను అని చెప్పాడు. నోటీసులు సర్వ్ చెయ్యటానికి వెళ్ళిన పోలీసులకు ఇల్లు ఆఫీసు రెండు తాళం వేసి కనిపించాయట.ఇదిలా ఉండగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రదీప్‌కు శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఈ క్రమంలో ప్రదీప్ వ్యవహారంపై ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ అమరకాంత్ రెడ్డి స్పందించారు.

తానూ ముందుగా అనుకున్న షూటింగ్‌లో బిజీ ఉండటం వల్లే రాలేకపోయానని ప్రదీప్ చెప్పిన విషయాన్ని ఒక వీడియోలో చూశామని అడిషనల్ డీసీపీ తెలిపారు. ప్రదీప్ రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కౌన్సిలింగ్ కి హాజరైతే 2 గంటల పాటు ప్రదీప్ తల్లిదండ్రుల సమక్షంలో ఆయనకు కౌన్సెలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం లో ఎంత వారినైనా క్షమించేది లేదని తెలియ చేసారు. ఇదిలా ఉండగా అత్యవసర షూటింగ్స్ ఉన్నాయని చెప్పిన ప్రదీప్‌, పోలీసులను 10 రోజుల గడువు కోరినట్టు తెలుస్తోంది. దీనిపై కుడా పోలీసులు సానుకూలంగా స్పందించారు. జనవరి 15 లోగా రాక‌పోతే ఛార్జిషీట్ ఖచ్చితంగా న‌మోదు చేస్తామ‌ని స్పష్టంచేశారు ట్రాఫిక్ అద‌న‌పు డీసీపీ అమ‌ర్‌కాంత్‌రెడ్డి.ఒక వేళ గడువులోపు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేస్తామని తెలిపారు. తర్వాత కోర్టు అనుమతితో వారెంట్ జారీ చేసి ప్రదీప్‌ను అరెస్టు చేస్తామని అమరకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ప్రదీప్ అభిమాని ఒకరు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చేసిన పోస్ట్‌కు కామెంట్ గా… “సార్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి పాపం చిన్నపిల్లోడు తెలిక చేసేశాడు” అంటూ  పెట్టారు. దానికి తమదైన శైలిలో స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. “ఎవరినీ కించపరచడం లేదు,చిన్నపిల్లోడు అయితే పాలు తాగాలి కాని మందు తాగి నడపడం కరెక్ట్ కాదు కదా? సెలబ్రిటీస్ అందరికీ ఆదర్శంగా ఉండాలి” అని  రిప్లై చేసారు, ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఏది ఏమైనా ప్రదీప్ అనుకోకుండా చేసిన ఒక పొరపాటు చాలా దూరం వెళ్ళింది.

Advertisements

Leave a Reply