BREAKING : ‘అతిలోక సుందరి’ శ్రీదేవి మరణం : Rest in Peace

అతిలోక సుందరి, మహా నటి శ్రీదేవి ఇక లేరు. దుబాయ్ లో ఒక వివాహానికి వెళ్ళిన శ్రీదేవి అక్కడ గుండెపోటు తో మరణించారు. మొహిత్ మర్వా వివాహానికి కుటుంబం తో కలిసి వెళ్ళిన శ్రీదేవి అక్కడే మరణించారు. భర్త బోనీ కపూర్, చిన్న కూతురు హాని కపూర్ తో కలిసి ఆ వివాహానికి వెళ్ళారు. ఆవిడ పెద్ద కుమార్తె జాన్వి కపూర్ ఆ వివాహానికి వెళ్ళలేదు అని తెలుస్తుంది. జాన్వి తన తోలి చిత్రం ధడక్ షూటింగ్ లో బిజీ గా ఉండటం తో ముంబై లోనే ఉండిపోయింది. బాలివుడ్ ప్రముఖులు, శ్రీదేవి నివాసానికి చేరుకుంటున్నారు. శ్రీదేవి వయసు యాభై నాలుగు సంవత్సరాలు. బాలనటి గా నట ప్రస్థానం ప్రారభించిన శ్రీదేవి బాషాబేదం లేకుండా అన్ని బాషల్లోను, అందరు సూఅప్ర్ స్టార్స్ తో నటించారు. శ్రీదేవి ఆకస్మిక మరణం భారత చలన చిత్ర పరిశ్రమ కు తీరని లోటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here