2019లో కృష్ణా జిల్లా నుంచి పోటి చేసే వైకాపా అభ్యర్ధుల లిస్టు ఇదే

Advertisements

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై వైకాపా తమ పార్టీ నాయకులకు స్పష్టత ఇస్తోంది. రాజకీయ చైతన్యం అధికంగా కలిగిన కృష్ణా జిల్లాలో ముందుగా అభ్యర్థులను అనధికారికంగా  జగన్‌ ఆయా అభ్యర్ధులకు తెలియ చేసారని ఆ పార్టీకి చెందిన నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా మీడియాతో చెబుతున్నారు.కృష్ణా జిల్లాలో వై ఎస్‌ జగన్‌ పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై నాయకులకు పూర్తి స్పష్టత ఇచ్చారని అంటున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, ఒకటి రెండు తప్ప అన్నిటిపైనా ఆయన స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని ఆయా నియోజకవర్గాల్లో వారిని పని మొదలు పెట్టమని చెప్పారని అంటున్నారు వైకాపా నాయకులు. దీనిలో ఆఖరి నిమిషంలో ఆర్ధిక సమీకారణాల వల్ల మార్పులు చేర్పులు జరగవచ్చని కూడా వారు అంటున్నారు. ఇప్పటికి ఉన్న వారిలో వీరే బలమైన అభ్యర్థులని అధినేత భావించారని వారు అంటున్నారు.

విజయవాడ వెస్ట్‌: గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి,బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి వైకాపా అభ్యర్థి జలీల్‌ఖాన్‌ పై  ఓడిపోయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తారని తెలుస్తోంది. కొద్ది కాలం క్రిందటే ఆయన బిజెపి కి రాజీనామా చేసి వైకాపాలో చేరారు, దీంతో ఇక్కడ నుంచి వెల్లంపల్లిని పోటీ చేయిస్తానని జగన్‌ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది

విజయవాడ తూర్పు: ఇటీవలే పార్టీలో చేరిన మాజీ టిడిపి నాయకుడు యలమంచలి రవి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని పార్టీ స్పష్టం చేస్తోందట. గతంలో ఇక్కడ నుంచి టిడిపి సీనియర్‌ నాయకుడు దేవినేని నెహ్రూ ను రవి ఓడించారు. దీంతో ఇక్కడ మరోసారి అటువంటి మ్యాజిక్‌ చేయవచ్చు అనే భావనతో అధిష్టానం ఆయనను ఎంపిక చేసిందని చెబుతున్నారు. అయితే దెవినేని నెహ్రు వర్గం ఇప్పుడు గద్దెతో ఉండటంతో యలమంచిలి రవి గెలుపు అసాధ్యం అని చెప్తున్నారు.

పెడన: వైకాపా సీనియర్‌ నాయకుడు జోగి రమేష్‌ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన వేదవ్యాస్‌ అనంతర పరిస్థితుల్లో టిడిపిలో చేరిపోయారు. బిసీలు అధికంగా ఉన్న ఇక్కడ నుంచి జోగి అయితే విజయం సాధించగలరని జగన్‌ నమ్ముతున్నారట. అందుకే ఇక్కడ నుంచి జోగి ని రంగంలోకి దింపుతున్నారట.

 

తిరువూరు: గత ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణ నిధి కే ఇక్కడ నుంచి మళ్లీ జగన్‌ సీటు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలుపొందిన రక్షణనిధి పార్టీని అంటి పెట్టుకున్నారని ఆయనకే సీటు ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారట.

నూజివీడు: ఇక్కడ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు పోటీ చేస్తారు గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధించిన జమీందార్‌ మేకా పార్టీ మారతారని వార్తలు వచ్చినా పార్టీలోనే కొనసాగారు. దీంతో ఈయనకు కూడా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది

మైలవరం: జగన్‌ను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా టార్గెట్‌ చేస్తోన్న జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించడానికి జగన్‌ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆర్ధికంగా బలమైన వసంత కృష్ణ ప్రసాద్  అయితే బాగుంటుందని భావించి ఆయనను ఇక్కడ పోటీ చేయడానికి ఒప్పించారట.

గుడివాడ:  గుడివాడలో మళ్లీ కొడాలి నాని నే పోటీ చేస్తారు. ఆయన మరోసారి విజయం సాధిస్తారని వైకాపా శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి

కైకలూరు: ఈ స్థానం నుంచి దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తారని జగన్‌ తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు.గత ఎన్నికల్లో బిజెపి-టిడిపి అభ్యర్థిపై భారీ తేడాతో ఓడిపోయిన ఉప్పల రామప్రసాద్‌ ను జగన్‌ పక్కకు తప్పించారు.

విజయవాడ సెంట్రల్‌: ఈ స్థానం నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తారని సమాచారం.గత ఎన్నికల్లో రాధాకృష్ణ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గద్దె రామ్మోహన్‌రావుపై భారీ తేడాతో ఓడిపోయారు.దీంతో తనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న విజయవాడ సెంట్రల్‌ నుంచే తాను పోటీ చేస్తానని రాధ జగన్‌ కు చెప్పినట్లు దానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే మల్లాది విష్ణు సైతం నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుకుగా ఉండటంతో ఎన్నికల వేళ రాధాను తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అవనిగడ్డ: గత ఎన్నికల్లో పోటీ చేసిన సింహాద్రి రమేష్‌నే మళ్లీ బరిలోకి దింపడం ఖాయం ఆయన ఈసారి గెలుస్తారని జగన్‌ భావిస్తున్నారట.అందుకే ఆయనకు సీటు ఖరారు చేశారని చెబుతున్నారు

పెనమలూరు: గత ఎన్నికల్లో వైకాపాకు ఇక్కడ నుంచి భారీ దెబ్బ తగిలింది ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్‌ దాదాపు 31,138 ఓట్ల తేడాతో బోడె ప్రసాద్ చేతిలో ఓడిపోయారు.దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని జగన్‌ నిర్ణయానికి వచ్చారు.ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థి కోసం జగన్‌ వేట ప్రారంభించారు ఆర్థికంగా బలమైన అభ్యర్థి దొరకకపోతే కుక్కలనే కొనసాగించే అవకాశం ఉంది.

పామర్రు: గత ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టిడిపిలో చేరడంతో ఇక్కడ వైకాపాకు నాయకత్వ కొరత ఉంది ఇక్కడ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం వెతుకులాటలో

ఉంది మొత్తం మీద ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ఫైనల్‌ చేసుకుని జగన్‌ పోరాటానికి సిద్ధమయ్యారని జిల్లా నాయకులు చెబుతున్నారు

జగ్గయ్యపేట: ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసిన సామినేని ఉదయభాను మళ్లీ పోటీ చేస్తారు.కాపు కులంలో బలమైన నాయకుడిగా ఉన్న భాను కు మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారట దీంతో ఆయనకు సీటు ఖాయమైనట్లే

నందిగామ: ఎస్సీ నియోజకవర్గమైన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జగన్మోహన్‌రావు నే మళ్లీ పోటీ చేస్తారు. ఆయన కంటే బెటర్‌ అభ్యర్థి దొరికితే ఆయనను మారుస్తారనే ప్రచారం ఉంది

మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన నాని కే మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది

గన్నవరం: టిడిపి బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి NRI యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తారని పార్టీ అధినేత చెప్పినట్లు తెలుస్తోంది యార్లగడ్డ అయితే వంశీ కి మంచిపోటీ ఇవ్వగలరని ఆయన అంచనా వేస్తున్నారు

 

Advertisements

Leave a Reply