2018 సమాంతా సొంతం : దేనికో తెలుసా?

Advertisements

2010 లో తెలుగు సినిమాల్లో ప్రయాణం ప్రారంభించిన సమంతా ని ఇష్టపడని వారు ఉండరు. ఏ మాయ చేసావే తో తెలుగు ప్రేక్షకులని మాయ చేసిన సమాంత, బృందావనం,దూకుడు,ఈగ లాంటి వరుస బ్లాక్స్ బస్టర్స్ తో తెలుగు వారి అభిమాన నటి అయిపొయింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య ని ప్రేమించి, వివాహం చేసుకున్న సమాంత గత ఏడాది అంతా పెళ్ళి పనుల్లో బిజీగా ఉంది కేవలం రెండు మూవీస్ లోనే చేసింది. తమిళ్ లో మెర్సల్, తెలుగులో రాజుగారిగది లాంటి బ్లాక్ బస్టర్స్ లో మాత్రమె నటించింది.కాని 2018 లో అక్కినేని సమంతా జోరు ని కాని స్పీడు ని కాని అందుకునే మరొక హీరోయిన్ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ప్రత్యూష సపోర్ట్ తో ఒక పక్క సేవలు అందిస్తూ సామాజిక బాద్యత నిర్వర్తిస్తున్న సమాంత 2018 లో గేరు మార్చి దూసుకుని వెళ్తుంది. ఈ ఒక్క సంవత్సరం సమంతా జోరు గమనిస్తే….

సమంత తెలుగులో నటిస్తున్న రంగస్థలం, మహానటి సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో మార్చ్ నెలాఖరున విడుదలకి సిద్ధం అవుతున్నాయి. అంతేనా, తమిళంలోనూ సమంత కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పెడెం లేదు. కోలీవుడ్ లో విశాల్ సరసన నటించిన ఇరుమ్బు తిరయి, విజయ్ సేతుపతి తో నటించిన సూపర్ డీలక్స్ సినిమాలు కూడా ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే విడుదల కాబోతున్నాయి. అలానే శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్న సమంతా దానిని కూడా ఇదే సంవత్సరం రిలీజ్ అవుతుంది. మరి చేతినిండా సినిమాలతో యమ బిజీగా వున్నా సమంత రిలాక్స్ అయ్యే గాప్ కూడా లేకుండా నిర్మాతగా కూడా మారనుంది. తాను నిర్మాతగా, హీరోయిన్ గా చెయ్యబోయే యు టర్న్ సినిమా కూడా ఈ ఏడాదే మొదలవుతుంది.  ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లోనే విడుదల చెయ్యాలని ప్లాన్ చేసింది సమంత. అ మరి ఈ లెక్కన సమంత కంటే బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా?. ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సమంత ఈ ఏడాది సాధిస్తుందని అక్కినేని, సమంతా అభిమానులు ఖుషి గా వున్నారు. ఆల్ ద బెస్ట్ సమంతా…..

Advertisements

Leave a Reply