14-03-18 : TDP మీద మోడీ ఒక నిర్ణయం తీసుకుని తీరాల్సిన రోజు

14-03-2018 ఏంటి ఈ డేట్ కి ఉన్న ప్రాముఖ్యత, ఆ రోజు కి తెలుగు దేశానికి ఏమి సంభందం? తెలుగు దేశం తో బంధానికి ఆ రోజు కి ఏమి సంభందం అని ప్రశ్నిస్తే సంబంధం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ షా ద్వయానికి దేశ వ్యాప్తం గా వ్యతిరేక పవనాలు వీస్తున్నయనేది అనేది ఎవరు కాడలేని అంశం. నల్లధనం వెనక్కి తెస్తా లాంటి ఎన్నో హామీలు గాలికి వదిలేసారు. మోడీ మీద వ్యతిరేకత పెరుగుతూ ….

వస్తుంది. నోట్ల రద్దు అప్పుడు ప్రజలు స్వచ్చందం గా మద్దతు ఇచ్చారు, అలాంటిది GST కి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు, ఎంత వ్యతిరేకత అంటే నోట్ల రద్దు ని కూడా తెలివి తక్కువ చర్య అని ఇప్పుడు అనే అంత. ఒక ప్రధానిగా మోడీ దేశాలు తిరగటం వారి ఆతిధ్యం స్వీకరించటం తప్పితే, పెద్దగా ఊడపెరికింది ఏమి లేదనేది సగటు భారతీయుడి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మార్చ్ 14 చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. రాజస్థాన్ బైపోల్లో కాంగ్రెస్ BJP ని మట్టి కరిపించింది. గుజరాత్ లో ముక్కుతూ మూలుగుతూ గట్టెక్కింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కర్ణాటక,త్రిపుర రాష్ట్రాల ఎన్నికలు తెర మీదకి వచ్చాయి.ఆ ఎన్నికల్లో గెలిస్తే తప్పితే, అది కుడా భారీ ఆధిక్యం తో గెలిస్తే తప్పితే మోడీ కి మనుగడ కష్టం. ఆ ఎన్నికల్లో క్లోజ్ మార్జిన్స్ తో గెలిస్తే ఆ మార్జిన్స్ కరిగిపోవటానికి ఎక్కువ కాలం పట్టదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కరిగిపోతే మోడీ కి దెబ్బ పడిపోతుంది. అయితే మార్చ్ 14 విషయానికి వస్తే…ఈ అప్డేట్ బీహార్ రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. యూపీలోని ఫుల్పూర్, గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గాలు, బీహార్లోని అరారియా, భబువా, జెహాన్ బాద్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్చ్ 11న పోలింగ్, అదే నెల…

14న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. యూపీలో ఉపఎన్నికలు జరగబోయే రెండు ఎంపీ నియోజకవర్గాలు గోరఖ్ పూర్, ఫుల్పూర్.. ప్రస్తుత యూపీ సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాతో ఖాళీ అయినవే. దీనితో ఈ ఎన్నికలు మోడీ కి అగ్ని పరీక్ష గా మారాయి, ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే మోడీ ప్రభ కుప్పకూలినట్టే. మోడీ అనే మత్తు లో నుంచి సగటు ఓటర్ ఇప్పటికే బయటకి వచ్చారు, ఈ ఎన్నికలలో తేడా జరిగితే ఇంకా అంతే. ఆల్రేడి గుజరాత్ ఎన్నికల తర్వాత చంద్రబాబు దూకుడు పెంచారు, రాజస్థాన్ ఎన్నికల తర్వాత మరింత ఒత్తిడి పెంచారు. కేంద్రం మెడలు వంచారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో జరిగే రెండు రాష్ట్రాల్లో యుపి లో బిజెపి అధికారం లో ఉండగా, బిహార్ లో బిజెపి మద్దతు తో నితీష్ కుమార్ ఉన్నారు.అధికారం లో ఉన్న రెండు రాష్ట్రాల్లో కూడా మోడీ మునిగితే అది బిజెపి పతనానికి నాంది గా భారత్ దేశం అంతా మోగిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వానికి మార్చ్ 5లోగా ప్రకటిస్తాం అని చెప్పినవి, ప్రకటించకుండా మార్చ్ 14 గెలిస్తే చంద్రబాబు లేకుండా నడుద్దాం అనుకోవచ్చు, కాని వెంటనే వచ్చే కర్ణటక ఎన్నికల్లో అంత ఈజీ గా లేదు….మోడీ 14 న చంద్రబాబు తో

సఖ్యత కి రావాల్సిన అవసరమే ఎక్కువ. 2019లో చంద్రబాబు అవసరం ఎంతో తెలీకుండా మోడీ పిఎం అయ్యి ఉంటాడా? ఆలోచించండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here